ఒక వ్యక్తి తన శారీరక వ్యసనాన్ని అధిగమించిన తర్వాత, సమస్య మళ్లీ అభివృద్ధి చెందకుండా నిరోధించడం కోసం మాదకద్రవ్యాలు మరియు మద్యం నుండి ఎలా దూరంగా ఉండాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం. అలా చేయడం కోసం ఉత్తమ జీవిత మార్గం అనుసరించే దిశగా మెరుగైన నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఇలా చేయడం అంత సులభమేమీ కాదు మరియు దానికి సమయం పడుతుంది.
మద్యం లేదా మాదకద్రవ్యాలు దుర్వినియోగం చేసిన స్త్రీ తరచుగా బలహీనంగా మరియు సిగ్గు పడుతున్నట్టుగా ఉంటుంది. అయితే, తన జీవితాన్ని మెరుగ్గా చేసుకోవడానికి తాను మార్పులు చేయగలనని ఆమె తెలుసుకోవాలి. ఈ ప్రక్రియ ప్రారంభించడం కోసం తాను సమస్యలను అధిగమించగలనని తనకు తాను మరియు ఇతరుల వద్ద నిరూపించుకోవడంలో సహాయపడే చిన్న చిన్న మార్పులు చేయడమే ఆమె ముందుండే ఏకైక మార్గం.
మహిళలు నైపుణ్యాలు పెంపొందించుకోవడంలో సహాయపడే కొన్ని ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి:
మీరు మద్యపానం విడిచిపెట్టిన తర్వాత, వీలైనంత త్వరగా, ఎక్కువ ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలతో ఉండే ఆహారాలు (లేదా పానీయాలు) తినడం ప్రారంభించండి. శరీరం స్వయంగా స్వస్తత పొందడంలో ఈ ఆహారాలు సహాయపడతాయి. అవి: కాలేయం, ఈస్ట్, ముడి గోధుమలతో తయారు చేసిన రొట్టెలు, ఇతర తృణధాన్యాలు, బీన్స్ మరియు ముదురు ఆకుపచ్చ కూరగాయలు. మీరు ఈ ఆహారాలు తినలేకపోతే, విటమిన్లు మీకు సహాయపడగలవు. ఫోలిక్ ఆమ్లం కలిగిన మల్టీ-విటమిన్ లేదా బి-కాంప్లెక్స్ విటమిన్ తీసుకోండి.
మీకు సన్నిహితమైన వ్యక్తులతో మద్దతు నెట్‌వర్క్ అభివృద్ధి చేసుకోండి మరియు మీకు అవసరమైనప్పుడు సహాయం కోసం వారిని అడగండి. మీరు ఇతరులతో మాట్లాడగలిగినప్పుడు మరియు కలిసి పని చేయగలిగినప్పుడు సమస్యల గురించి ఆలోచించడం మరియు వాటిని పరిష్కరించడం మీకు చాలా సులభం కాగలదు.
ఒక సమయంలో ఒక సమస్య పరిష్కారం కోసం మాత్రమే ప్రయత్నించండి. తద్వారా, మీరు భరించలేరనుకున్న సమస్యలు సైతం మీకు అంత పెద్దవిగా అనిపించవు.
మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే లేదా కలతపెట్టే లేదా మిమ్మల్ని విచారానికి లేదా కోపానికి గురిచేసే విషయాల గురించి మీ ఫ్రెండ్ లేదా మీరు విశ్వసించే ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేయండి. మీకు అలాంటి భావన ఎందుకు వస్తోంది మరియు మంచి అనుభూతి కోసం మీరేం చేయవచ్చో మీరు అర్థం చేసుకోవచ్చు.
మీ సంఘం మెరుగుదల కోసం ఇతరులతో కలసి ఏదైనా ప్రాజెక్టులో పనిచేయండి. మార్పు కోసం ఎలా పని చేయాలో మీకు తెలుసని మీతో పాటు ఇతరులకూ అది రుజువు చేస్తుంది. ఇలా చేయడం వల్ల వ్యక్తిగత మార్పులు చేసుకోవడంలో కూడా మీకు సహాయపడగలదని మీరు గుర్తించవచ్చు.
మద్యం లేదా మాదకద్రవ్యాల నుండి దూరంగా ఉండటడం కోసం మీరు కలిసి పనిచేసే ఇతర వ్యక్తులను క్రమం తప్పకుండా కలుసుకోండి.
మద్యం లేదా మాదకద్రవ్యాలు తీసుకోవాలనే బలమైన కోరిక కలిగించే ప్రదేశాలకు దూరంగా ఉండండి. మాదకద్రవ్యాలు మరియు మద్యం ఉండని సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఇతరులతో కలిసి పనిచేయండి.