మానసిక గాయం అనుభవించిన తర్వాత, మహిళలో అనేక విభిన్న ప్రతిచర్యలు ఉండవచ్చు, అవి:
ఆమె మనస్సులో ఆ గాయం మళ్లీ మళ్లీ గుర్తుకు రావడం. ఆమె మెలకువగా ఉన్నప్పుడు, జరిగిపోయిన ఆ భయంకర విషయాలు గుర్తు చేసుకుంటూనే ఉండవచ్చు. రాత్రి సమయంలో ఆమెకి వాటి గురించిన కలలు రావచ్చు లేదా వాటి గురించి ఆలోచిస్తున్న కారణంగా ఆమె నిద్రపోలేకపోవచ్చు.
తిమ్మిరిగా అనిపించడం లేదా ఆమెలో భావోద్వేగాలనేవి మునుపటి కంటే తక్కువ బలంగా ఉంటాయి. తన మానసిక గాయాన్ని గుర్తుచేసే వ్యక్తులను లేదా ప్రదేశాలను ఆమె తప్పించుకోవచ్చు.
ఆమె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆమె నిరంతరం ప్రమాదం శంకిస్తుంటే, విశ్రాంతి తీసుకోవడంలో మరియు నిద్రపోవడంలో ఆమెకు ఇబ్బంది ఉండవచ్చు. దిగ్భ్రాంతికి గురైనప్పుడు ఆమె అతిగా స్పందించవచ్చు.
జరిగిన దాని గురించి ఆమె చాలా కోపంతో లేదా సిగ్గుతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏదైనా ప్రమాదంలో ఇతరులు మరణించడం లేదా తీవ్రంగా గాయపడడం జరిగి, ఒక స్త్రీ తాను మాత్రం ఆ పరిస్థితి నుండి బయటుపడినప్పుడు, తన కంటే ఇతరులకు ఎక్కువ కష్టం కలిగిందనే అపరాధ భావన ఆమెలో కలగవచ్చు.
ఇతరుల నుండి వేరుగా మరియు దూరంగా ఉన్నట్లు అనిపించడం.
వింతైన లేదా హింసాత్మక ప్రవర్తన కారణంగా, తాను ఎక్కడుందనే విషయంలోనూ ఆమె గందరగోళానికి గురవుతుంది.
మానసిక గాయం ప్రతిస్పందనలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా ఆందోళన లేదా నిరాశకు గురవుతారు లేదంటే వాళ్లు మద్యం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి పాల్పడవచ్చు
ఈ సంకేతాలనేవి చాలావరకు ఒక కష్టమైన పరిస్థితికి సాధారణ ప్రతిస్పందనలుగా ఉంటాయి. ఉదాహరణకు, మానసిక గాయం ఎదురైనప్పుడు కోపం రావడం లేదా పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉంటే అప్రమత్తంగా ఉండటం సాధారణమే అయినప్పటికీ, ఒక వ్యక్తి తన రోజువారీ కార్యకలాపాలు సైతం నిర్వహించలేని విధంగా వారిలో సంకేతాలు చాలా తీవ్రంగా ఉంటే లేదా గాయం ఎదురైన కొన్ని నెలల తర్వాత సంకేతాలు ప్రారంభమైతే, ఆ వ్యక్తిలో మానసిక ఆరోగ్య సమస్య ఉండవచ్చు.