మూత్రాశయం మరియు మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్లు రావడానికి కారణమేమిటి
From Audiopedia
మూత్ర వ్యవస్థకు సోకే ఇన్ఫెక్షన్లకు సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) కారణంగా ఉంటాయి. యోనికి దగ్గర్లో ఉండే మూత్ర ద్వారం ద్వారా ఇవి బయటి నుండి శరీరంలోకి ప్రవేశిస్తాయి. మహిళల్లో క్రింది భాగంలోని మూత్రం గొట్టం చిన్నదిగా ఉంటుంది కాబట్టి, పురుషుల కంటే మహిళల్లో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. ఈ చిన్న మూత్ర నాళం ద్వారా సూక్ష్మక్రిములు సులభంగా మూత్రాశయంలోకి ప్రవేశిస్తాయి.