యుక్తవయస్సు సమయంలో నా శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి
అమ్మాయిలందరూ వారి శరీరంలో మార్పులు ఎదుర్కొన్నప్పటికీ, ప్రతి అమ్మాయిలోనూ ఆ మార్పులు భిన్నంగా సంభవిస్తాయి. కాబట్టి, మీ సోదరి లేదా స్నేహితురాలి శరీరం లాగా మీ శరీరం కనిపించలేదని చింతించకండి.
ఎదుగుదల ఈ సమయంలో మీరు వేగంగా పెరగడమనేది బహుశా మీలో మొదటి మార్పుగా కనిపించవచ్చు. కొంతకాలం పాటు మీరు మీ వయస్సు అబ్బాయిల కంటే, పొడవుగా ఉండవచ్చు. నెలసరి రక్తస్రావం ప్రారంభమైన 1 నుండి 3 సంవత్సరాల తర్వాత, మీలో పెరుగుదల ఆగిపోతుంది.
శరీరంలో మార్పులు మీరు వేగంగా పెరగడంతో పాటు, మీ శరీరంలో మార్పులు మొదలవుతాయి. శరీరంలో హార్మోన్లు అనే సహజ రసాయనాలు ఉంటాయి. ఇవి మీ శరీరం పెరిగేలా చేయడం ద్వారా, మీలో ఈ మార్పులకు కారణమవుతాయి.
మీ శరీరం లోపల మీరు చూడలేని ఇతర మార్పులు మీ శరీరం లోపల జరుగుతాయి. గర్భసంచీ (గర్భాశయం), గొట్టాలు, అండాశయాలు మరియు యోని పెరుగుతాయి మరియు స్థానం మారుతాయి.
మీకు ఎలా అనిపిస్తుంది మీలో ఈ మార్పులు చోటుచేసుకునే సమయంలో, మీ శరీరం గురించి మీకు మరింత అవగాహన వస్తుంది. మీకు అబ్బాయిల పట్ల మరియు మీ స్నేహితుల పట్ల కూడా ఆసక్తి పెరగవచ్చు. మీ భావాలు నియంత్రించడం కష్టంగా ఉండే సందర్భాలు ఉండవచ్చు. నెలసరి రక్తస్రావం ముందు రోజుల్లో, మీలో ఆనందం, కోపం మరియు ఆందోళన లాంటి అన్ని రకాల బలమైన భావోద్వేగాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఉదాహరణకు.
నెలసరి రక్తస్రావం (పీరియడ్స్, రుతుస్రావం) నెలసరి రక్తస్రావం అనేది మీ శరీరం గర్భం ధరించగలదనేందుకు సంకేతం. ఏ అమ్మాయికీ తన మొదటి నెలసరి రక్తస్రావం ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా తెలియదు. అయితే, ఆమె రొమ్ములు మరియు ఆమె శరీరం మీద వెంట్రుకలు పెరగడం ప్రారంభమైన తర్వాత సహజంగా ఇది జరుగుతుంది. ఆమెకి మొదటిసారి నెలసరి రక్తస్రావం జరగడానికి చాలా నెలల ముందే ఆమె యోని నుండి కొంత తేమ రావడం గమనించవచ్చు. దీనివల్ల ఆమె లోదుస్తుల మీద మరక పడవచ్చు. ఇది సాధారణ విషయమే.
తమ మొదటి నెలసరి రక్తస్రావం సమయంలో తమకేం అవసరమో తెలిసినప్పుడు అమ్మాయిలు ఆసమయంలో సంతోషంగా ఉంటారు. ఆ విషయం గురించి అప్పటివరకు ఏ విషయమూ తెలియకపోతే, రక్తస్రావం మొదలైనప్పుడు వాళ్లు ఆందోళన చెందుతారు. ఇది మహిళలందరికీ జరిగే విషయమే. కాబట్టి, మీరు దానిని అంగీకరించి, గర్వంగా కూడా భావించవచ్చు. అదొక అసహ్యమైన లేదా సిగ్గుచేటు విషయం అని మీతో అనేందుకు ఎవరినీ అనుమతించకండి.