యువతులు వాళ్ల జీవితాలను అంతం చేసుకోవాలని భావించడానికి కారణమేమిటి

From Audiopedia
Jump to: navigation, search

యుక్త వయస్సు అమ్మాయిలు అనేక సవాళ్లు మరియు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ప్రత్యేకించి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

  • వాళ్లని తరచుగా పాఠశాలకు వెళ్లకుండా ఆపేసి, ఇంటి బాధ్యతలు నెరవేర్చేలా బలవంతం చేస్తుంటారు. వాళ్లు తమ సామర్ధ్యాలు లేదా ఆశయాలు మరచిపోవడం తప్ప వాళ్లకి మరో ఎంపిక ఉండదు.
  • వాళ్లు తరచుగా వాళ్ల ఇంటి బయట వాళ్లతో కలసి మాట్లాడడానికి కూడా అనుమతించరు
  • కొన్నిసార్లు వాళ్లని కనీసం ఇంటి నుండి బయటకు కూడా అనుమతించబడరు
  • కొన్నిసార్లు వాళ్లు చిన్న వయసులోనే వైవాహిక జీవితంలోకి ప్రవేశించాల్సి వస్తుంది
  • లైంగిక చర్య గురించి పెళ్లికి ముందు వాళ్లకెవరూ చెప్పరు లేదా సరైన రీతిలో చెప్పరు. కాబట్టి, ఆ విషయంలో వాళ్లకి పక్వత ఉండదు. అందుకే, ఇలాంటి అమ్మాయిలు చిన్న వయస్సులోనే గర్భం దాల్చుతుంటారు. ఆ విషయం బయటకు తెలిసినప్పుడు వాళ్ల సహచరులు మరియు సమాజం నుండి గుసగుసలు మరియు బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

చాలామంది బాలికలు మరియు యువతులు చాలా అసంతృప్తితో ఉంటారు. వాళ్ల (సహచరుల సమూహం, వారి కుటుంబం, సోషల్ మీడియా లేదా సినిమాల్లో లాగా) ఒక నిర్దిష్ట తీరుతో (ఆదర్శ సౌందర్యం అనే భావనకు అనుగుణంగా) కనిపించడం మరియు ప్రవర్తించడం కోసం వాళ్లు అవిశ్రాంతమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. తాము అందవిహీనంగా ఉన్నామని, తమనెవరూ ప్రేమించరని మరియు ఎవరైన తమని కోరుకునే అర్హత తమకి లేదని భావిస్తుంటారు. ఈ భావన చివరకు తమను తాము గాయపరచుకోవడం లేదా డ్రగ్స్ లాంటి వాటికి బానిస కావడం లాంటి స్వీయ-హానికి దారితీయవచ్చు.

Sources
  • Audiopedia ID: tel020904