రక్తహీనతను నేనెలా నివారించగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

  • మీ రక్తహీనతకు మలేరియా, పరాన్నజీవులు లేదా పురుగులు కారణమైతే, ముందుగా ఆ వ్యాధులకు చికిత్స చేయండి.
  • శరీరం ఇనుమును గ్రహించడంలో సహాయపడే విటమిన్లు ఏ మరియు సి అధికంగా ఉండే ఆహారాలతో పాటు ఇనుము అధికంగా ఉండే ఆహారాలు తినండి. నిమ్మజాతి పండ్లు మరియు టమోటాల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ముదురు పసుపు మరియు ముదురు ఆకుపచ్చ ఆకు కూరల్లో విటమిన్-ఏ సమృద్ధిగా ఉంటుంది. ఒక మహిళ తగినంత ఇనుము కలిగిన ఆహారం తినలేకపోతే, ఆమె ఐరన్ మాత్రలు తీసుకోవాల్సి రావచ్చు.
  • బ్లాక్ టీ లేదా కాఫీ తాగడం లేదా భోజనంలో ఊక (ధాన్యాల బయటి పొర) తినడం మానుకోండి. ఆహారం నుండి శరీరం ఇనుము గ్రహించకుండా ఇవి నిరోధించగలవు. * పరాన్నజీవుల ఇన్ఫెక్షన్లు నివారించడానికి శుభ్రమైన నీళ్లు త్రాగండి.

మల విసర్జన కోసం లెట్రిన్ ఉపయోగించండి. దీనివ్లల క్రిముల గుడ్లు ఆహారం మరియు నీటి వనరుల్లో వ్యాపించకుండా ఉంటాయి. మీ ప్రాంతంలో కొంకి పురుగులు సర్వసాధారణమైతే, బూట్లు ధరించడానికి ప్రయత్నించండి.

  • జననాల మధ్య కనీసం 2 సంవత్సరాల వ్యవధి ఉండేలా చూడండి. తద్వారా, మరో గర్భానికి ముందు కొంత ఇనుము నిల్వ చేసుకునే అవకాశం మీ శరీరానికి లభిస్తుంది.
Sources
  • Audiopedia ID: tel010416