రసాయనాలతో పనిచేయడం నా ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

చాలామంది మహిళలు ప్రమాదకర రసాయనాలతో సంబంధం కలిగి ఉంటారు. అయితే, తరచుగా వాళ్లకి ఆ విషయమే తెలియదు. ఎందుకంటే, రోజువారీ జీవితంలో మరియు పనిలో ఉపయోగించే అనేక ఆధునిక ఉత్పత్తుల్లో రసాయనాలు దాగి ఉంటాయి. వాటిలో కొన్ని చాలా హానికరం కావచ్చు. అవి:

  • పురుగుమందులు, ఎరువులు, కలుపు సంహారకాలు మరియు జంతువుల వ్యర్థాలు.
  • పెయింట్లు, పెయింట్ థిన్నర్లు, పెయింట్ రిమూవర్ మరియు ద్రావకాలు.
  • ఇంధనాలు మరియు పాత్రలు మెరియడం కోసం వాటికి వేసిన సీసం కోటింగ్.
  • బ్లీచ్ మరియు లే కలిగిన శుభ్రపరిచే ఉత్పత్తులు.
  • హెయిర్ డ్రెస్సింగ్ మరియు సౌందర్య ఉత్పత్తులు.

కొన్ని రసాయనాల వల్ల మీకు అనారోగ్యం అనిపించకపోయినప్పటికీ, అవి మీ శరీరానికి హాని కలిగిస్తాయి. కొన్ని రసాయనాలను మీరు ఉపయోగించడం మానేసిన తర్వాత కూడా హాని కలిగించే విధంగా ఉంటాయి. అలాంటి కొన్ని నష్టాలు కొద్ది కాలమే ఉంటాయి. కొన్ని నష్టాలు నష్టం శాశ్వతంగా ఉంటాయి. ఉదా:

  • తలనొప్పి, మైకము
  • ముక్కు కారడం, దగ్గు
  • కంటిలో చికాకు
  • దంత క్షయం, నీలం చిగుళ్లు
  • ఛాతీ మరియు ఊపిరితిత్తుల్లో సమస్యలు
  • కాలేయ సమస్యలు
  • మూత్రాశయం మరియు మూత్రపిండాల సమస్యలు
  • చర్మ సమస్యలు
Sources
  • Audiopedia ID: tel030111