రుతువిరతి నా శరీరం మరియు మనసు మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది
మహిళకు వయసు మీద పడుతోందని చెప్పే ప్రధాన సంకేతాల్లో ఆమెలో నెలసరి రక్తస్రావం ఆగిపోవడం కూడా ఒకటి. ఇది అకస్మాత్తుగా ఆగిపోవచ్చు లేదా 1 నుండి 2 సంవత్సరాల్లో క్రమక్రమంగా ఆగిపోవచ్చు. చాలా మంది మహిళల్లో ఈ మార్పు 45 మరియు 55 సంవత్సరాల మధ్య సంభవిస్తుంది.
సంకేతాలు;
స్త్రీలోని అండాశయాల్లో అండాల తయారీ ఆగిపోవడం మరియు ఆమె శరీరంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్లు తక్కువగా తయారు కావడాన్ని ఈ లక్షణాలు సూచిస్తాయి. తక్కువ ఈస్ట్రోజెన్‌కి ఆమె శరీరం అలవాటు పడిన తర్వాత ఈ లక్షణాలు క్రమంగా తగ్గిపోతాయి.
ఒక మహిళ తన నెలవారీ రక్తస్రావం ఆగిపోవడం ఎలా భావనకు లోనవుతుందనేది తన శరీరంలోని మార్పుల కారణంగా ఆమె ఎలా ప్రభావితమయ్యిందనే దానిమీద ఆధారపడి ఉంటుంది. వృద్ధ మహిళలు గురించి ఆమె సమాజం ఎలా ఆలోచిస్తుంది మరియు వ్యవహరిస్తుంది అనే దానిమీద కూడా అది ఆధారపడి ఉంటుంది. ప్రతి నెలా నెలసరి రక్తస్రావం ఉండకపోవడం ఆమెకు ఉపశమనం కలిగించినప్పటికీ, ఇకపై తనకి పిల్లలు కనే అవకాశం లేదని ఆమె బాధపడే పరిస్థితి ఉండొచ్చు.