రుతుస్రావం-ముందస్తు రుగ్మత PMS అంటే ఏమిటి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

నెలసరి రక్తస్రావం ప్రారంభమయ్యే కొన్ని రోజుల ముందు నుండి కొంతమంది మహిళలు మరియు బాలికలకు అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి వారిలో రుతుస్రావ-ముందస్తు రుగ్మత (PMS)గా పిలిచే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంకేతాల సమూహం ఉండవచ్చు. PMS ఉన్న మహిళల్లో వీటిని గమనించవచ్చు:

  • రొమ్ముల్లో నొప్పి
  • పొత్తి కడుపులో నిండుగా ఉన్న అనుభూతి
  • మలబద్ధకం (మల విసర్జన సులభంగా చేయలేరు)
  • ఎక్కువ అలసటగా భావిస్తారు
  • కండరాల నొప్పులు, ప్రత్యేకించి వెన్ను క్రింది భాగంలో లేదా కడుపులో
  • యోని తేమలో మార్పు
  • ముఖం మీద జిడ్డు లేదా మచ్చలు (మొటిమలు)
  • ప్రత్యేకించి, బలమైన లేదా నియంత్రించడానికి కష్టమైన భావనలు

చాలామంది మహిళల్లో ప్రతినెలా ఈ సంకేతాల్లో కనీసం ఒకటి ఉండవచ్చు మరియు కొందరు మహిళళ్లో ఇవన్నీ ఉండవచ్చు. మహిళల్లో ఒక్కో నెలలో ఒక్కో సంకేతం కూడా ఉండవచ్చు. చాలా మంది మహిళల్లో, నెలసరి రక్తస్రావం ప్రారంభానికి ముందు కొన్ని రోజులు నుండి అశాంతిగా ఉంటుంది. అయితే, మరికొందరు మహిళలు ఆ సమయంలో తాము మరింత సృజనాత్మకంగా మరియు మెరుగ్గా పనులు చేయగలుగుతున్నట్టు చెప్పారు.

Sources
  • Audiopedia ID: tel010218