PMS ఎదుర్కోవడంలో సహాయపడే అంశాలనేవి ఒక్కో మహిళకు భిన్నంగా ఉంటాయి. తనకు ఏది సహాయకరంగా ఉంటుందో తెలుసుకోవడం కోసం ప్రతి మహిళ వివిధ విషయాలు ప్రయత్నించాలి మరియు ఆమెకు మంచి అనుభూతి అందించే వాటిని గుర్తించాలి. ముందుగా, నెలసరి రక్తస్రావంతో వచ్చే నొప్పి నుండి ఉపశమనం కోసం ఈ సూచనలు అనుసరించడానికి ప్రయత్నించండి.
ఈ అంశాలు కూడా సహాయపడవచ్చు:
ఉప్పు తక్కువగా తినండి. ఉప్పు వల్ల మీ శరీరం లోపల నీటి పరిమాణం పెరుగుతుంది. దీంతో, మీ పొత్తి కడుపు భారంగా అనిపిస్తూ, పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుంది.
కెఫిన్ (కాఫీ, టీతో పాటు కోలా లాంటి కొన్ని శీతల పానీయాలో ఉంటుంది) తీసుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి.
తృణధాన్యాలు, వేరుశెనగలు, తాజా చేపలు, మాంసం మరియు పాలు లేదా ప్రోటీన్ అధికంగా ఉండే ఇతర ఆహారాలు తినడానికి ప్రయత్నించండి. ఈ ఆహారాలను జీర్ణం చేసుకునే క్రమంలో, మీ శరీరం అదనపు నీటిని కూడా తొలగిస్తుంది కాబట్టి, మీ కడుపు తక్కువ నిండుగా మరియు బిగుతుగా అనిపిస్తుంది.
PMS సంకేతాల ఉపశమనానికి కొన్నిసార్లు వ్యాయామం సహాయపడగలదు.
మూలికా ఔషధాలు ప్రయత్నించండి. మెరుగైన ఉపశమనం అందించే దాని కోసం మీ సమాజంలోని వృద్ధ మహిళలను అడగండి.