రోజులు లెక్కింపు పద్ధతి ఎలా ఉపయోగించాలి
ఈ పద్ధతి చక్కగా పని చేయాలంటే, మీరు మీ రుతుచక్రం 8వ రోజు నుండి మీ రుతుచక్రం లోని 19వ రోజు వరకు సెక్స్‌లో పాల్గొనకూడదు. ఈ రోజుల్లో మీరు సెక్స్‌లో పాల్గొనాలనుకుంటే, కుటుంబ నియంత్రణకు సంబంధించిన వేరొక పద్ధతి ఉపయోగించాలి.
మీరు మీ ఫలవంతమైన రోజులు గుర్తుంచుకోవడానికి పూసలు, చార్ట్ లేదా మరేదైనా సాధనం ఉపయోగించవచ్చు. 3 వేర్వేరు రంగుల్లో ఉండే 32 పూసలను ఒక నెక్లెస్‌లాగా తయారు చేయండి. ప్రతి రంగు పూస మీ రుతుచక్రంలో ఒక్కో విభిన్న భాగాన్ని సూచిస్తుంది:
మీ నెలసరి రక్తస్రావం మొదటి రోజున, ఎర్ర రంగు పూస చుట్టూ ఒక ఉంగరం లేదా తీగ చుట్ట ఉంచండి. ప్రతిరోజూ దాన్ని ఒక్కో పూస మీదుగా ముందుకు జరపండి. ఆ ఉంగరం ఏదైనా తెల్ల రంగు పూస మీద ఉంటే, ఆసమయంలో సెక్స్‌లో పాల్గొంటే మీరు గర్భవతి కావచ్చని అర్థం. మీ తదుపరి నెలసరి రక్తస్రావం మొదలైనప్పుడల్లా, మొదటిరోజున ఆ ఉంగరాన్ని మళ్లీ ఎర్ర రంగు పూస మీదకు తరలించండి.