రోజువారీ జీవితంలోని ఒత్తిడి అనేది నా మానసిక ఆరోగ్యాన్ని ఏవిధంగా దెబ్బతీస్తుంది

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

రోజువారీ కార్యకలాపాలు మరియు సంఘటనలనేవి తరచుగా ఒక మహిళ మీద ఒత్తిడికి కారణమవుతాయి. ఆమె శరీరం మరియు మనస్సులో ఇది ఉద్రిక్తత (ఒత్తిడి) కలిగిస్తుంది. అనారోగ్యం లేదా అధిక పని లాంటి శారీరక సమస్యలు కూడా ఒత్తిడికి దారితీయవచ్చు లేదా కుటుంబంలో సంఘర్షణ లేదా ఆ స్త్రీ నియంత్రించలేని సమస్యల కోసం ఆమెని నిందించడం లాంటి భావోద్వేగ సంఘటనల వల్ల కూడా ఒత్తిడి రావచ్చు. ఆనందం అందించే సంఘటనలు-శిశు జననం లేదా ఉద్యోగం రావడం లాంటివి కూడా ఒత్తిడికి దారితీయవచ్చు. ఇవి స్త్రీ జీవితంలో మార్పులు సృష్టించడమే అందుకు కారణం.

చాలామంది మహిళలకు అన్ని వైపుల నుండి ఒత్తిడి కలిగించే అనేక రకాల అంశాలు ఉంటాయి:

  • పిల్లలను చూసుకోవడం
  • భర్త అవసరాలను తీర్చడం
  • నీళ్లు, ఇంధనం తీసుకురావడం
  • శుభ్రపరచడం
  • అనారోగ్యంతో ఉన్నవారికి సపర్యలు చేయడం
  • తగినంత డబ్బు లేకపోవడం
  • వ్యవసాయం లేదా పని చేయడం
  • చాలా తక్కువ ఆహారం
  • రోజువారీ జీవితంలో ఒత్తిడిని గమనించడం కష్టం. ఎందుకంటే, అది ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే, ఈ రకమైన ఒత్తిడిని ఎదుర్కోవటానికి ఒక మహిళ చాలా శక్తి వెచ్చించాల్సి ఉంటుంది.

ఒక మహిళ ప్రతిరోజూ మరియు చాలాకాలం పాటు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు, ఆమెకి ఆ పరిస్థితి తీవ్రంగా మరియు భరించలేనిదిగా అనుభూతి కలిగించడం ప్రారంభించవచ్చు. ముందుగా ఇతరుల అవసరాలు పూర్తిచేసి, చివరగా మాత్రమే తన సొంత అవసరాలు చూసుకోవాలనే ఆమెకి నేర్పడం వల్ల ఆమె తన పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే, ఆమె సమస్య మరింత తీవ్రమవుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి లేదా ఆమె ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే విషయాలు ఆస్వాదించడానికి ఆమెకి తక్కువ సమయమే ఉంటుంది కాబట్టి, ఆమె తన అనారోగ్యం లేదా అధిక పని సంకేతాలను విస్మరించవచ్చు మరియు ఒక మహిళగా, తన పరిస్థితిని మార్చుకునే శక్తి ఆమెకి తక్కువగా ఉండవచ్చు.

తరచుగా ఒక మహిళ బలహీనంగా లేదా అనారోగ్యంతో ఉన్నట్టు కనిపించినప్పటికీ, ఆమెకి సంబంధించి నిజమైన సమస్య అనేది ఆమె జీవితం సముచితంగా లేదా సరైన రీతిలో ఉండకపోవడమే అందుకు కారణం కావచ్చు. మెరుగైన మానసిక ఆరోగ్యంతో ఉండాలంటే, మహిళలు తమ జీవితాల మీద మరింత నియంత్రణ మరియు శక్తి కలిగి ఉండాలి.

Sources
  • Audiopedia ID: tel011502