రోడ్డు దాటే సమయంలో నా పిల్లలకు గాయాలు తగలకుండా ఎలా నివారించగలను - Audiopedia
రోడ్డు దాటే సమయంలో క్రింది జాగ్రత్తలు పాటించాలని పిల్లలకు నేర్పించండి:
- రోడ్డు పక్కన ఆగండి
- రెండు వైపులా చూడండి
- రోడ్డు దాటే ముందు అటువైపు ఏవైనా కార్లు లేదా ఇతర వాహనాలు వచ్చే శబ్దం కోసం వినండి
- మరొక వ్యక్తి చేయి పట్టుకోండి
- నడవండి, పరిగెత్తకండి
- పట్టణ ప్రాంతాల్లో పాదచారుల మార్గాలు ఉపయోగించండి
- రోడ్డు వంపు తిరిగి ఉన్నచోట లేదా నిలిపి ఉన్న కార్లు మధ్య రోడ్డు దాటకండి
- వాహనాలు వేగంగా వెళ్లే రోడ్లు దాటకండి.
Sources