లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు STIలు అంటే ఏమిటి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

లైంగిక ప్రక్రియ సమయంలో ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సంక్రమించే ఇన్ఫెక్షన్లనే లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు లేదా STIలు అంటారు. లైంగిక ప్రక్రియ ఏ రకమైనదైనప్పటికీ - యోనిలోకి పురుషాంగం చొప్పించే లేదా పాయువులోకి పురుషాగం చొప్పేంచే లైంగిక ప్రక్రియ లేదా నోటిలో చేసే లైంగిక ప్రక్రియ (నోటిలోకి పురుషాంగం చొప్పించడం లేదా నోటితో యోనిని ప్రేరేపించడం) STI సంక్రమించవచ్చు. వ్యాధి సోకిన వ్యక్తి పురుషాంగం లేదా యోని మీద మరొక వ్యక్తి మర్మాంగాలు రుద్దుకోవడం ద్వారా కూడా కొన్నిసార్లు STIలు సోకవచ్చు. గర్భిణీ స్త్రీ ప్రసవించడానికి ముందే లేదా ప్రసవ సమయంలో ఆమె నుండి ఆమె బిడ్డకి STIలు సంక్రమించవచ్చు. HIV సంక్రమించే లేదా సంక్రమింపజేసే ప్రమాదాన్ని కూడా STIలు పెంచుతాయి. STIలకి త్వరగా చికిత్స చేయకపోతే, వాటివల్ల:

  • పురుషులు మరియు మహిళలు ఇద్దరిలోనూ వంధ్యత్వానికి దారితీస్తుంది.
  • నెలలు నిండని, చాలా చిన్న పరిమాణంలో, అంధత్వంతో, అనారోగ్యంతో శిశువులు జన్మిస్తారు లేదా ప్రసవ సమయంలో శిశువులు మరణిస్తారు.
  • ట్యూబ్ లోపల గర్భం (గర్భాశయం వెలుపల గర్భం పెరగడం).
  • తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా మరణం.
  • పొత్తికడుపులో దీర్ఘకాలికంగా నొప్పి.
  • గర్భాశయ ముఖద్వార క్యాన్సర్.
  • STIల కోసం భాగస్వాములిద్దరూ త్వరగా చికిత్స చేయించుకోవడం ద్వారా, అనేక తీవ్రమైన సమస్యలు నివారించవచ్చు.
Sources
  • Audiopedia ID: tel010501