వంధ్యత్వం అంటే ఏమిటి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ఒక జంట కుటుంబ నియంత్రణ పద్ధతి ఏదీ పాటించకుండా, ఒక సంవత్సరం పాటు నెలలో కొన్నిసార్లు సంభోగంలో పాల్గొన్నప్పటికీ, ఆ మహిళకు గర్భం రాకపోతే, ఆ జంటకు వంధ్యత్వ సమస్య ఉన్నట్టు మనం చెప్పవచ్చు. ఒక జంటకు వరుసగా 3 లేదా అంతకంటే ఎక్కువ గర్భస్రావాలు (గర్భం కోల్పోవడం) జరిగినప్పుడు కూడా వారికి సంతాన సాఫల్య సమస్య ఉందని అర్థం.

ఇప్పటికే సంతానం కలిగిన పురుషుడు లేదా స్త్రీ కూడా వంధ్యత్వానికి గురికావచ్చు. చివరి బిడ్డ పుట్టిన తర్వాతి సంవత్సరాల్లో వారిలో ఈ సమస్య ఏర్పడవచ్చు. కొన్నిసార్లు ఈ సమస్య పురుషుడికో లేదా స్త్రీకో కాకుండా, ఇద్దరికీ ఉండవచ్చు. కొన్నిసార్లు భాగస్వాములిద్దరూ ఆరోగ్యంగా కనిపించడంతో పాటు ఏ వైద్యుడు లేదా వైద్య ప్రక్రియ కూడా వారి సమస్యను నిర్ధారించలేని పరిస్థితి ఎదురుకావచ్చు.

Sources
  • Audiopedia ID: tel011201