వంధ్యత్వాన్ని నేనెలా నిరోధించగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

మీకు వెంటనే గర్భం రాకపోతే చింతించకండి: సంతానోత్ఫత్తికి స్త్రీ సిద్ధంగా ఉన్న రోజుల్లో లైంగిక చర్యలో పాల్గొన పక్షంలో, చాలా జంటలకు ఒక సంవత్సరం లోపలే గర్భం వస్తుంది.

ప్రమాదకర పురుగుమందులు లేదా కర్మాగారాలు మరియు పొలాల్లో ఉపయోగించే విష రసాయనాలతో కలుషితమైన గాలి, ఆహారం లేదా నీటికి దూరంగా ఉండండి: పురుగుమందులు మరియు ఇతర హానికర రసాయనాలతో పనిచేసే పురుషుడిలో అవి అతని వీర్యాన్ని దెబ్బతీస్తాయి మరియు అతని దుస్తులను ఉతికే సమయంలో, ఆ హానికర రసాయనాలు ఆమెలోకి కూడా ప్రవేశిస్తాయి.

ధూమపానం లేదా పొగాకు నమలడం, లేదా మద్యం లేదా కాఫీ తాగడం మానుకోండి:

ధూమపానం చేసే లేదా పొగాకు నమిలే లేదా ఎక్కువ మొత్తంలో మద్యం లేదా కాఫీ తాగే మహిళల్లో గర్భం దాల్చడం ఆలస్యం కావచ్చు లేదా ఎక్కువసార్లు గర్భస్రావం జరగవచ్చు. పొగతాగే మరియు ఎక్కువ మొత్తంలో మద్యం లేదా కాఫీ తాగే పురుషుల్లో వీర్యం ఉత్పత్తి తగ్గిపోతుంది మరియు తరచుగా అది దెబ్బతింటుంది లేదా బలహీనంగా మారుతుంది.

అధిక ఉష్ణోగ్రతల్లో ఉండకండి:

పురుషుడి వీర్య కణాలకు చల్లదనం కావాలి. అందుకే, పురుషుల్లో వృషణాలు శరీరం వెలుపల వృషణాల తిత్తిలో ఉంటాయి. వృషణాలు చాలా ఎక్కువగా వేడెక్కినప్పుడు అవి ఆరోగ్యకర వీర్యకణాలు తయారు చేయడం మానేస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి శరీరం లోపలికి వృషణాలు నొక్కుకుపోయే విధంగా బిగువైన దుస్తులను ధరిస్తే, లేదా చాలా వేడి నీళ్లతో స్నానం చేస్తే లేదా బాయిలర్లు, కొలిములు లేదా అత్యధిక దూరాలు డ్రైవ్ చేసే సమయంలో ట్రక్కులోని వేడి ఇంజిన్ లాంటి వేడి వస్తువులకు దగ్గర ఉన్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తవచ్చు-ప్రత్యేకించి, విరామం లేకుండా అనేక గంటలు డ్రైవ్ చేస్తే ఈ పరిస్థితి రావచ్చు. వృషణాలు చల్లబడిన తర్వాత, అవి మళ్లీ ఆరోగ్యకరమైన వీర్యం తయారు చేయడం ప్రారంభిస్తాయి.

ఔషధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి:

కొన్ని మందులు సంతానోత్పత్తిని దెబ్బతీస్తాయి. మీరు గర్భం ధరించే ప్రయత్నంలో ఉన్నప్పుడు మీరు మరియు మీ భాగస్వామి ఎలాంటి మందులు తీసుకోకుండా ఉండడం ఉత్తమ ఎంపిక. ఏదైనా అనారోగ్యం కారణంగా మీరు మందులు తీసుకోవాల్సి వస్తే, ఆరోగ్య కార్యకర్తతో మాట్లాడండి. మీరు గర్భం కోసం ప్రయత్నిస్తున్నట్టు వారికి చెప్పండి.

సంతానోత్పత్తికి మీరు సిద్ధంగా ఉన్న సమయాల్లో లైంగిక ప్రక్రియలో పాల్గొనండి:

ఒక పురుషుడిలో ప్రతిరోజూ లక్షలాది వీర్యకణాలు తయారైనప్పటికీ, ఆరోగ్యకరమైన స్త్రీలో నెలకు ఒక అండం మాత్రమే విడుదలవుతుంది. అండం వెలువడే సమయాన్నే ఆ స్త్రీకి సంబంధించి సంతానోత్ఫత్తి సాఫల్య సమయంగా పిలుస్తారు-ఆ నెలలో ఆమె గర్భవతి కాగల ఏకైక సమయం ఇది. చాలామంది మహిళల్లో వారి సంతానోత్పత్తి సాఫల్య సమయం అనేది వారి నెలసరి రక్తస్రావం మొదలైన మొదటి రోజు నుండి సుమారుగా 10 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది మరియు సుమారుగా 6 రోజులు కొనసాగుతుంది. మీరు సంతానసాఫల్య స్థితిలో ఉన్నప్పుడు మీరు గ్రహించగల స్థాయిలో అనేక సంకేతాలు శరీరంలో కనిపిస్తాయి. మీ యోనిలోని శ్లేష్మంలో మార్పులు రావడమనేది సులభంగా గుర్తించగల సంకేతం కాగలదు.

మీరు సంభోగంలో పాల్గొన్నప్పుడు: మీ గర్భాశయంలోకి వీర్యం సులభంగా ప్రవేశించడానికి ఉపయోగపడే అత్యుత్తమ భంగిమలు:

  • మీరు వెల్లకిలా పడుకుని, పురుషుడు మీకు పైన ఉండాలి.
  • ఒక వైపుగా తిరిగి పడుకోవడం.

ఈ భంగిమల్లో సంభోగం ముగించిన తర్వాత, సుమారుగా 20 నిమిషాలు వెల్లకిలా పడుకోండి. దీనివల్ల వల్ల వీర్యం మీ గర్భాశయంలోకి ఈదుకుంటూ వెళ్లడానికి మరియు అండాన్ని చేరుకోవడానికి వీలవుతుంది.

లైంగిక చర్య సమయంలో నూనెలు లేదా క్రీమ్‌లు ఉపయోగించవద్దు: ఇవి వీరాన్ని చంపేయగలవు లేదా అండాన్ని చేరకుండా ఆపగలవు.

మీ యోని లోపలి భాగాల్లోకి నీళ్లు పోసుకోవడం లేదా కడగడం చేయకండి: లైంగిక చర్యకు ముందు లేదా తర్వాత, యోని లోపలి భాగాలు కడగడం వల్ల ఆ ప్రదేశంలోని తేమలో మార్పు రావచ్చు. ఆకారణంగా, వీర్యకణాలు జీవించడం కష్టం కావచ్చు.

ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే చికిత్స తీసుకోండి: మీరు మరియు మీ భాగస్వామి ఇద్దరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి మరియు STIలు మరియు ఇతర అనారోగ్యాల కోసం పరీక్షలు చేయించుకుని, అవసరమైతే చికిత్స పొందాలి. మీలో ఎవరికైనా STIs ఉంటే, మీరిద్దరూ చికిత్స చేయించుకోవాలి. మీకు సూచించిన మందులన్నింటినీ పూర్తిగా తీసుకున్నారని నిర్ధారించుకోండి.

మంచి, ఆరోగ్యకరమైన ఆహారం తినండి: మీకు క్రమం తప్పకుండా నెలసరి రక్తస్రావం లేకపోతే మరియు మీరు చాలా సన్నగా లేదా చాలా లావుగా ఉంటే, బరువు పెరగడానికి లేదా తగ్గడానికి ప్రయత్నించండి.

ధూమపానం లేదా పొగాకు నమలడం, మత్తుపదార్థాలు తీసుకోవడం లేదా మద్యం తాగడం మానుకోండి.

కాఫీ, బ్లాక్ టీ మరియు కోలా పానీయాలు లాంటి కెఫిన్ కలిగిన పానీయాలు మానేయండి.

చక్కగా విశ్రాంతి తీసుకోండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

ఒక సంవత్సరం తర్వాత కూడా మీకు గర్భం రాకపోతే ఆరోగ్య కార్యకర్త వద్దకు వెళ్లే ప్రయత్నం చేయండి: కొన్ని సాధారణ పరీక్షలు ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయకుండానే మీ సమస్య గురించి ఈ పరీక్షలు చెప్పగలవు. ఉదాహరణకు, మీ భాగస్వామి వీర్యాన్ని సూక్ష్మదర్శిని క్రింద చూడడం ద్వారా, వారి వీర్యం ఆరోగ్యంగా ఉందో, లేదో ఆరోగ్య కార్యకర్త చెప్పగలరు. మీ యోని, గర్భాశయం మరియు ట్యూబులు పరీక్షించడం ద్వారా వాటిలో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా పెరుగుదలలు ఉన్నాయా అని చెప్పగలరు లేదా ప్రతి ఉదయం మీ శరీర ఉష్ణోగ్రత పరీక్షించడం ద్వారా, మీ అండాశయాల నుండి అండం విడుదలవుతోందా అని మీరే తనిఖీ చేసుకోవడాన్ని ఆమె మీకు నేర్పించగలదు. అయితే, ఈ పరీక్షలతో మీ సమస్య ఏమిటో మాత్రమే మీకు తెలుస్తుందని గుర్తుంచుకోండి-సమస్యకు పరిష్కారం అందించవని గుర్తుంచుకోండి. చాలా సందర్భాల్లో, అత్యంత ఖరీదైన మందులు మరియు శస్త్రచికిత్సలతో సైతం వంధ్యత్వం నయం చేయడం వీలుకాదు.

Sources
  • Audiopedia ID: tel011204