వాసెక్టమీ పురుషుడికి చేసే శస్త్రచికిత్స గురించి నేనేం తెలుసుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

వాసెక్టమీ అనేది ఒక సాధారణ శస్త్రచికిత్స. వృషణాల నుండి పురుషాంగానికి వీర్యం తీసుకెళ్లే గొట్టాలను కత్తిరించడం ద్వారా ఈ శస్త్రచికిత్స పూర్తి చేస్తారు. పురుషుడి వృషణాలు కత్తిరించరు. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త ఉన్న ఏ ఆరోగ్య కేంద్రంలోనైనా ఈ ఆపరేషన్ చేయవచ్చు. ఇది చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది.

ఈ శస్త్రచికిత్స వల్ల పురుషుడు ఆనందం పొందగల లేదా అనుభూతి చెందగల సామర్థ్యంలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ శస్త్రచికిత్స తర్వాత కూడా పురుషుడు స్ఖలిస్తాడు. అయితే, అతడి వీర్యంలో వీర్యకణాలు ఉండవు. శస్త్రచికిత్స తర్వాత కూడా 12 వారాల వరకు గొట్టాల్లో వీర్యం ఉండవచ్చు కాబట్టి, ఆ వ్యవధి పూర్తయ్యే వరకు మీరు కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో ఏదో ఒకటి ఉపయోగించాలి.

Sources
  • Audiopedia ID: tel020518