వాహన ప్రయాణంలో పిల్లలకు గాయాలు తగలకుండా ఎలా నిరోధించాలి
కారు ముందు సీట్లో, పర్యవేక్షణ లేకుండా ట్రక్కు లేదా వ్యవసాయ యంత్రాల బెడ్ మీద లేదా మోటారుసైకిల్ మీద పిల్లలు ప్రయాణించినప్పుడు వాళ్లకి తీవ్రంగా గాయలయ్యే ప్రమాదం ఉంది.
పిల్లలు 150 సెంటీమీటర్ల ఎత్తు లేదా 10 సంవత్సరాలు లేదా పెద్దవాళ్ల సీటు బెల్ట్ ఉపయోగించేంత వయసు వచ్చేంతవరకు, పిల్లలు కారులో ప్రయాణించే సమయంలో వారి వయసుకి తగట్టుగా చైల్డ్ రిస్ట్రెయిన్ట్ లేదా బూస్టర్ సీటు ఉపయోగించాలి.
తల్లిదండ్రులు లేదా ఇతర సంరక్షకులతో మోటారుబైక్ మీద ప్రయాణించేటప్పుడు, పిల్లలతో సహా అందరూ హెల్మెట్ ధరించాలి మరియు అది గడ్డం క్రిందకి చక్కగా కట్టి ఉండాలి. అప్పుడే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అది ఊడిపోకుండా ఉంటుంది.
పిల్లల్లో తరచుగా సైకిల్ సంబంధిత గాయాలు మరియు మరణం సంభవిస్తుంటుంది. పిల్లలందరూ తప్పక రోడ్డు భద్రత నేర్చుకోవాలి మరియు సైకిల్ తొక్కేటప్పుడు సైకిల్ హెల్మెట్ ధరించాలి.