విరేచనాలు అంటే ఏమిటి మరియు అది నా బిడ్డకు ఎందుకు ప్రమాదకరం

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

సూక్ష్మక్రిములు నోటిలోకి వెళ్లడం వల్ల, మరీముఖ్యంగా మలం నుండి వచ్చే సూక్ష్మక్రిములు నోటిలోకి వెళ్లడం వల్ల విరేచనాలు సంభవిస్తాయి. మలాన్ని సురక్షితం కాని పద్ధతిలో పారవేయడం, సరిగా లేని పరిశుభ్రతా పద్ధతులు, స్వచ్ఛమైన తాగునీరు లేకపోవడం లేదా శిశువులకు తల్లిపాలు ఇవ్వలేకపోవడం లాటి కారణాల వల్ల తరచుగా విరేచనాలు సంభవిస్తుటాయి.

విరేచనాల సమయంలో శరీరం నుండి ద్రవాలు బయటకు పోవడం వల్ల పిల్లలు చనిపోతుంటారు. విరేచనాల వల్ల చిన్నారులు డీహైడ్రేషన్‌కు గురవుతారు. పెద్దవారితో పోలిస్తే, అతిసారం వల్ల పిల్లలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, నిర్జలీకరణం మరియు పోషకాహార లోపం వారి మీద త్వరగా ప్రభావం చూపుతుంది. అతిసారం ప్రారంభమైన వెంటనే, శిశువుకు సాధారణ ఆహారాలు మరియు ద్రవాలతో పాటు అదనపు ద్రవాలు ఇవ్వడం చాలా అవసరం.

శిశువుకి రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు విరేచనాలు అవుతుంటే, అది అతిసారం అని అర్థం. మలం ఎంత పలుచగా ఉంటే, అతిసారం అంత ఎక్కువ ప్రమాదకరం కాగలదు.

ద్రవాలు తాగడం వల్ల అతిసారం మరింత తీవ్రమవుతుందని కొందరు అనుకుంటారు కానీ, అది నిజం కాదు. అతిసారం ఉన్న బిడ్డకు వీలైనంత తరచుగా తల్లి పాలతో పాటు ఇతర పానీయాలు ఇవ్వాలి. పెద్ద మొత్తంలో ద్రవాలు తాగడం వల్ల విరేచనాల సమయంలో శరీరం కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడానికి వీలవుతుంది.

Sources
  • Audiopedia ID: tel020701