వివాహం లేదా పని పేరుతో దూరానికి పంపడాన్ని ఎలా నిరోధించాలి
From Audiopedia - Accessible Learning for All
కొన్నిసార్లు కొన్ని పేద కుటుంబాల్లో కుటుంబ అప్పు చెల్లించడం కోసం చిన్న వయసు అమ్మాయిని వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటారు లేదా డబ్బు కోసం లేదా కుటుంబానికి అవసరమైన వాటి కోసం ఆమ్మాయిని అమ్మేయడం కూడా చేస్తుంటారు.
అలాంటి అమ్మాయిలను కొన్నిసార్లు వేరొక పట్టణం లేదా నగరానికి తీసుకువెళ్తారు. అక్కడ తాము కర్మాగారాల్లో లేదా పనిమనుషులుగా పని చేయాల్సి ఉంటుందని ఆ అమ్మాయిలు భావిస్తారు. అయితే, అక్కడ వాళ్లు తరచుగా డబ్బు కోసం సెక్స్ వ్యాపారం చేయాల్సి రావచ్చు.
మిమ్మల్ని లేదా మీ సమాజంలోని మరొక అమ్మాయిని పెళ్లి పేరుతో అమ్మేయడానికి లేదా పని పేరుతో దూరంగా పంపబోతున్నారని మీరు గ్రహిస్తే, ఎవరైనా వయోజన వ్యక్తి నుండి సహాయం పొందే ప్రయత్నం చేయండి. బహుశా, వయసులో పెద్ద వారైన మీ ఆంటీ లేదా అంకుల్ లేదా ఉపాధ్యాయురాలు లాంటివారు మీకు సహాయం చేయవచ్చు.