అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వివాహం అనేది మహిళలకు భారీ మొత్తంలో ఒత్తిడికి మూలంగా ఉంటోంది. వాళ్లలో ఆత్మహత్య ఆలోచనకు దారితీయగల కొన్ని అంశాలు:
చిన్న వయస్సులోనే వివాహాలు (కొన్నిసార్లు చాలా తక్కువ వయస్సులో పెళ్లి చేయడం)
భాగస్వామిని ఎన్నుకోవడంలో స్వయంప్రతిపత్తి లేకపోవడం (పెద్దలు కుదిర్చిన వివాహం)
కట్నం కోసం గొడవలు
పెళ్లైన రోజు నుండే పిల్లలు కనాలనే ఒత్తిడి (చాలా సందర్భాల్లో మగ సంతానం కోసం)
భర్త మరియు/లేదా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీద ఆర్థికంగా ఆధారపడడం
ఆర్థిక సమస్యలు
గృహ హింస
కుటుంబంలో గొడవలు లేదా కుటుంబ విభేదాలు
సాధారణంగా వారి స్వంత జీవితం మీదే వాళ్లకి నియంత్రణ మరియు అధికారం లేకపోవడం
సమాన హక్కులు లేకపోవడం
పెళ్లి పేరుతో చిన్న వయసులోనే సొంత వాళ్లందిరికీ దూరమై, భర్త ఇంటికి వెళ్లిపోవాల్సి రావడం. పర్యవసానంగా, వాళ్లు తమ సొంత కుటుంబం మరియు స్నేహితుల మద్దతు వాతావరణం కోల్పోతారు. చిన్నవయసులోనే మరియు అవాంఛిత సెక్స్‌కి వాళ్లు సిద్ధం కావాల్సి వస్తుంది. వారి అమాయకత్వం మరియు చిన్నతనం వారిని మరింత దుర్బలంగా మార్చేస్తుంది. తద్వారా, తగిన వయసులో పెళ్లైన వారితో పోలిస్తే, చిన్నవయసులో పెళ్లైన అమ్మాయిలు భర్తల నుండి హింసకి ఎక్కువ గురవుతారు. ఈ కారణాలన్నీ కలసి వాళ్లు ఆత్మహత్య వైపు అడుగులు వేసే ప్రమాదాన్ని తీవ్రంగా పెంచుతుంది.