వీపు పొట్ట కండరాలకు విశ్రాంతి బలం కలిగించే వ్యాయామాలు ఏమిటి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

జాబితా చేయబడిన క్రమంలో ప్రతిరోజూ క్రింది వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి:

1. మీ నడుము క్రింది భాగం సాగదీయండి:

మీరు వెళ్లకిలా పడుకుని మోకాళ్లను పట్టుకోండి. గాఢంగా ఊపిరి పీల్చి వదులుతూ, 10-15 సెకన్లు ఇదే భంగిమలో ఉండండి. మీరు శ్వాస వదిలే సమయంలో, స్ట్రెచ్‌ పెంచడం కోసం మీ మోకాళ్లను మీ ఛాతీకి మరింత దగ్గరగా తీసుకోండి. 2 సార్లు పునరావృతం చేయండి.

2. మెలిపెట్టండి:

వెళ్లకిలా పడుకోండి. మీ చేతుల్ని మీ పక్కల్లో నిటారుగా ఉంచండి. మీ మోకాళ్లు వంచండి. వాటిని అలాగే మెల్లగా ఒక పక్కకు వంచండి. అదే సమయంలో, మీ తలను వ్యతిరేఖ దిశలో తిప్పండి. మీ భుజాలు మాత్రం చదునుగానే ఉండేలా చూసుకోండి. కొన్నిసార్లు ఊపిరి పీల్చి, వదులుతూ అదే భంగిమలో ఉండండి. తర్వాత, మీ మోకాళ్లను మధ్యలోకి తీసుకురండి. తర్వాత, మెళ్లగా వాటిని మరొక వైపు తిప్పండి. మీ తలను వ్యతిరేఖ దిశలో తిప్పండి. రెండు వైపులా ఈ వ్యాయామాన్ని 2సార్లు పునరావృతం చేయండి లేదా మీ వెన్ను క్రింది భాగంలో కాస్త హాయిగా అనిపించే వరకు ఇలా చేయండి.

3. కటి భాగం మెలిపెట్టడం: వెళ్లకిలా పడుకోండి. మోకాళ్లు వంచండి. మీ వీపు క్రింది భాగం నేలకు ఆనుకుని ఉండాలి. మీ పొత్తికడుపు కండారాలు మరియు పిరుదుల వద్ద కండరాలను లాగి ఉంచి, 3 వరకు లెక్కించండి. మీకు సాధ్యమైనంతసేపు ఊపిరి బిగపట్టండి. తర్వాత, రిలాక్స్ అవ్వండి. తర్వాత, మీ నడుముని సాధారణ స్థితికి తీసుకురండి. ఈ వ్యాయామం పునరావృతం చేయండి.

Sources
  • Audiopedia ID: tel030108