వైకల్యం కలిగిన మహిళల్లో తరచుగా కండరాల సమస్యలు రావడానికి కారణమేమిటి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

కొంతమంది మహిళలు-ఉదాహరణకు, ఆర్థరైటిస్ లేదా స్ట్రోక్ కారణంగా బాధపడేవారు లేదా ఎయిడ్స్ లేదా వృద్ధాప్యం కారణంగా మంచం మీద ఉన్నవాళ్లు-వాళ్ల కీళ్లు స్వేచ్ఛగా కదిలే స్థాయిలో వాళ్ల చేతులు మరియు కాళ్ళు కదిలించడంలో ఇబ్బంది పడుతుంటారు.

ఇలాంటి పరిస్థితిలో, చేయి లేదా కాలు దీర్ఘకాలం ఒకే భంగిమలో వంగి ఉన్నప్పుడు, కొన్ని కండరాలు కృశించుకుపోతాయి మరియు ఆ అవయవం పూర్తి నిటారుగా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది లేదా చిన్న కండరాలన్నీ కలసి బిగుసుకుపోవడం వల్ల ఆ అవయవం అలాగే నిటారుగా ఉండిపోవచ్చు. తద్వారా, అది వంగదు. దీనినే 'బిగదీసుకుపోవడం' అంటారు. ఈ పరిస్థితి కొన్నిసార్లు తీవ్రంగా నొప్పి కలిగించవచ్చు.

Sources
  • Audiopedia ID: tel011107