వైకల్యం గురించిన తప్పుడు భావనలుగా వేటిని చెప్పవచ్చు
ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు వారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయగల స్థాయి వైకల్యంతో ఉన్నారు. నడవడం, ఏదైనా ఎత్తడం, చూడడం, వినడం లేదా ఆలోచన పరంగా ఆ మహిళకి ఇబ్బంది ఉండవచ్చు.
ఈ అధ్యాయంలో మనం 'వికలాంగ మహిళలు' అనే పదానికి బదులుగా 'వైకల్యంతో ఉన్న మహిళలు' అనే పదం ఉపయోగించనున్నాము. వైకల్యం అనేది ఒక మహిళ పని చేయడాన్ని నిరోధించినప్పటికీ, మిగిలిన విషయాల్లో ఆమె కూడా ఇతర మహిళల లాంటిదే అని అందరికీ గుర్తు చేయడం కోసమే మేము ఇలా చేస్తున్నాము. ఎందుకంటే, అన్నింటికంటే ముందు ఆమె ఒక మహిళ.
ఒక మహిళలో వైకల్యానికి ఏది కారణమైనప్పటికీ, వైకల్యం లేని ఇతర మహిళ లాగే ఆమె కూడా ఉత్పాదక శక్తి కలిగినదే. తనదైన నైపుణ్యాలను పూర్తిగా అభివృద్ధి చేసుకోవడానికి ఆమెకి అవకాశం ఇవ్వాలి.
స్థానిక ఆచారాలు మరియు నమ్మకాలనేవి వైకల్యం గురించి ప్రజల్లో తరచుగా తప్పుడు భావాలు కలిగిస్తుంటాయి. ఉదాహరణకు, ఒక మహిళకు వైకల్యం ఉంది అంటే, ఆమె గత జన్మలో ఏదో చెడు చేసింది. దానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తోందని లేదంటే, ఏదో 'సోకడం' (అంటువ్యాధి) వల్లే ఆమెకి ఆ పరిస్థితి వచ్చిందని అంటుంటారు. దాంతో, ఆమెతో సన్నిహితంగా ఉండడానికి అందరూ భయపడతారు. తప్పు చేసినప్పటికీ, ఎవరికీ వైకల్యాలు రాదు.