వైకల్యానికి కారణం ఏమిటి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

పేద దేశాల్లో, పేదరికం, ప్రమాదాలు మరియు యుద్ధాల కారణంగా అనేక వైకల్యాలు సంభవిస్తుంటాయి.

ఉదాహరణకు: మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు సరైన తిండి తినకపోతే, ఆమె బిడ్డ వైకల్యం (పుట్టుకతో వచ్చే లోపం)తో జన్మించవచ్చు.

శిశువు లేదా పసికందుకి తగినంత మంచి ఆహారం లభించకపోతే ఆ చిన్నారికి అంధత్వం లేదా మానసిక ఎదుగుదల తగ్గే పరిస్థితి రావచ్చు.

సరైన పారిశుద్ధ్యం లేకపోవడం మరియు రద్దీగా ఉండే జీవన పరిస్థితులు, నాసిరకం ఆహారం మరియు ప్రాథమిక ఆరోగ్య సేవలు మరియు టీకాల కొరత లాంటివి అనేక వైకల్యాలకు దారితీయగలవు. నేటి యుద్ధాల్లో, సైనికులు లేదా ఇతర పురుషుల కంటే మహిళలు మరియు పిల్లలే ఎక్కువ సంఖ్యలో చంపబడుతున్నారు లేదా వికలాంగులవుతున్నారు.

అయితే, వైకల్యంతో ముడిపడిన ఈ సమస్యలు పరిష్కారమైనప్పటికీ, వైకల్యం కలిగిన వ్యక్తులు మన జీవితంలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉండవచ్చు. ఎందుకంటే, వైకల్యం కూడా జీవితంలో ఒక సహజమైన భాగం.

Sources
  • Audiopedia ID: tel011102