వైకల్యాలలతో ఉండే మహిళలు తరచుగా ఆత్మ-గౌరవం కోల్పోవడానికి కారణమేమిటి
వైకల్యాలున్న మహిళలు తరచుగా వివక్షకు గురవుతుంటారు. వివాహ భాగస్వాములుగా వారు తిరస్కారానికి గురవుతుంటారు లేదా పని ప్రదేశంలో వారికి 'తప్పుడు' అస్తిత్వం ఆపాదిస్తుంటారు. విద్య అందుబాటులో ఉన్నప్పటికీ, వికలాంగ బాలికలు మరియు మహిళలు తరచుగా దానికి దూరంగానే ఉంటారు. ఉదాహరణకు, వికలాంగ పిల్లల కోసం నడిపే ప్రత్యేక పాఠశాలల్లోనూ, సాధారణంగా అబ్బాయిలకే ప్రాధాన్యం లభిస్తుంటుంది.
ఏదైనా పని కోసం శిక్షణ పొందే అవకాశం వికలాంగులైన మహిళలకు లభించదు. వారు శారీరకంగా, భావోద్వేగపరంగా మరియు లైంగికంగా దుర్వినియోగం ఎదుర్కొంటారు. వైకల్యాలు లేని పురుషులు మరియు మహిళలు లాగా ఇంట్లో లేదా సమాజంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారిని అరుదుగానే అనుమతిస్తుంటారు.
వికలాంగులైన మహిళలు తమను తాము విలువైన వ్యక్తిగా భావించకూడదని సమాజం తరచుగా బోధిస్తుంటుంది. పురుషుడితో వాళ్లు వ్యవహరించలేరనీ, పిల్లలు కనలేరనీ, అర్ధవంతమైన పని ఏదీ చేయలేరనీ సాధారణంగా భావిస్తుంటారు. కాబట్టి, ఆ విషయాలకు వాళ్లని పనికిరాని వారిగా పరిగణిస్తారు. వికలాంగులైన మహిళలు తమను తాము విలువైన వ్యక్తిగా నిరూపించుకున్నప్పుడు వాళ్ల సొంత కుటుంబం సైతం వాళ్లకి విలువ ఇస్తుంది.