వైకల్యాలున్న మహిళలకు తరచుగా చర్మ సమస్యలు రావడానికి కారణమేమిటి
From Audiopedia
మీరు అన్ని సమయాల్లో లేదా ఎక్కువ సమయం కూర్చుని లేదా పడుకుని ఉండడం వల్ల మీకు ఒత్తిడి సంబంధిత పుండ్లు రావచ్చు. శరీరంలోని ఎముక భాగాల మీది చర్మం కుర్చీ లేదా మంచానికి ఎక్కువసేపు నొక్కుకుని ఉండడం వల్ల ఈ పుండ్లు మొదలవుతాయి. ఈ ప్రదేశంలో రక్త నాళాలు నొక్కుకు పోవడం వల్ల, అక్కడి చర్మానికి తగినంత రక్తం లభించదు.
కదలకుండా ఎక్కువ సమయం గడపడం వల్ల, చర్మంపై ముదురు లేదా ఎరుపు రంగు మచ్చలు వస్తాయి. ఆ ఒత్తిడి అలాగే కొనసాగితే, చర్మం మీద పుండు ఏర్పడి అది తీవ్రమవుతుంది మరియు శరీరంలోకి మరింత లోతుగా వెళ్తుంది లేదా ఎముక వద్ద ప్రారంభమైన గాయం ఆ తర్వాత, మెళ్లగా చర్మం మీదకు పెరగవచ్చు. చికిత్స అందించనప్పుడు, ఆ చర్మం నిర్జీవం కావచ్చు.