వైవాహిక పాత్రల్లో వచ్చే విభేదాలను నేను ఏవిధంగా ఎదుర్కోవచ్చు
చాలా దేశాల్లో పురుషులు అధికార స్థానాల్లో ఉంటారు కాబట్టి, వారి మద్దతు మరియు సహాయం పొందడం చాలా ముఖ్యం. మీరు ఉద్యోగం కోసం వెతుకుతుంటే లేదా మీ భర్త మద్దతుతో మీ సొంత వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, అది మీ కుటుంబానికి అత్యంత సహాయకరంగా ఉండవచ్చు.
మీ ప్రణాళికలకు మీ భర్త వ్యతిరేకంగా ఉన్నారని మీరు అనుకుంటే, అతని మద్దతు పొందడానికి ఈ క్రింది వ్యూహాలు ఉపయోగించే ప్రయత్నం చేయండి:
1. మీ భర్తతో మాట్లాడే ముందు మీ ప్రణాళికల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీరు దానిని ఎలా చేయబోతున్నారో మీకే ఖచ్చితంగా తెలియకపోతే, అతను మీ ప్రణాళికలను అర్థం చేసుకుని, మీకు మద్దతు ఇస్తాడని ఎలా ఆశించగలరు?
2. మీరు ఏం చేయాలనుకుంటున్నారనే దాని గురించి అతని దృఢంగా, సంఘర్షణకు తావు లేనివిధంగా చర్చించండి. మీరు మీ ఆలోచనలను మీ భర్తతో చర్చించడం చాలా ముఖ్యం. అయితే, మీరు అతని మీద కేకలు వేయడం లేదా ఏడవడం కంటే, ప్రశాంతంగా మరియు స్నేహపూర్వకంగా ఉడడం ద్వారా, మీరు ఖచ్చితంగా ఎక్కువే సాధిస్తారు.
3. మీ భర్తతో సంప్రదించిన తర్వాతే మీ ప్రణాళికలు అమలు చేయండి. మీరు అతని సహాయం మరియు సలహా అడిగితే మీరు చేస్తున్న దాని గురించి అతను ఖచ్చితంగా తక్కువ అభద్రతతో మరియు తక్కువ అనుమానంతో ఉంటాడు. అలాగే, మీరు ప్రయత్నిస్తున్న మార్పుల నుండి మీరిద్దరూ లాభం పొందగలరని గుర్తించాలి.
4. మీ భర్త మీకు మద్దతు అందిస్తే, అతని జీవితం కూడా మెరుగుపడుతుందని వివరించండి. ఎందుకంటే, మీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది మరియు మీరు సంపాదించే డబ్బుని మీరు మీ కుటుంబం మరియు ఇంటి కోసం ఖర్చు చేయాలనుకుంటున్నారు.
5. మీరు డబ్బు సంపాదించడం వల్ల సంపన్న కుటుంబానికి అధిపతిగా అతని హోదా, సమాజంలో మీ కుటుంబం ప్రతిష్ట పెరుగుతుందని మీ భర్తకు చెప్పండి. కుటుంబంలో తానొక్కడే సంపాదించే వ్యక్తిగా ఉండాలని, అలా లేకపోతే ఇతరులు తమను తక్కువగా చూస్తారని కొంతమంది పురుషులు భయపడుతుంటారు. అలాంటి పరిస్థితి అరుదుగానే ఉంటుందని, చాలా సందర్భాల్లో, పని చేసే భార్యల వల్ల భర్తలు మరింత గౌరవం పొందుతారని అతనికి వివరించండి.
6. మీ పని నుండి పెరుగుతున్న ఆదాయం మీ పిల్లలందరికీ (అబ్బాయిలు మరియు అమ్మాయిలు) మెరుగైన విద్య అందించడానికి మీ ఇద్దరికీ వీలు కల్పిస్తుందని మీ భర్తకు సూచించండి. ప్రతి తండ్రి తన పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ వహిస్తాడు మరియు ఆధునిక ప్రపంచంలో మంచి విద్య అనేది విజయానికి మరియు మంచి జీతం ఉన్న ఉద్యోగానికి కీలకమని గుర్తిస్తాడు. మీ భర్త తన పిల్లలకు ఉత్తమమైనది ఇవ్వాలని కోరుకుంటే, అతను ఖచ్చితంగా ఈ అవకాశాన్ని నిరాకరించడు.
7. పని చేయడానికి బయటకు వెళ్ళిన లేదా మీరు కోరుకున్న విధంగానే విజయవంతంగా వ్యాపారాలు ప్రారంభించిన మహిళల వల్ల వారి కుటుంబాలు ఎలా ప్రయోజనం పొందాయో ఉదాహరణలుగా చూపించండి.
8. పైన పేర్కొన్నవన్నీ ప్రయత్నించిన తర్వాత కూడా, మీరు పని చేయడానికి అనుమతించే విషయంలో మీ భర్త విముఖంగానే ఉంటే, మీ సంఘర్షణను పరిష్కరించడంలో మీకు సహాయపడటానికి మరియు మీకు మద్దతు ఇవ్వడానికి ఇతర కుటుంబ సభ్యులను వెతికే ప్రయత్నం చేయండి. మీరు ఇతర మహిళలను కలుసుకుని వారి సహాయం మరియు మద్దతు కూడా పొందవచ్చు మరియు వారు తమ భర్తల మనస్సు ఎలా మార్చగలిగారో కూడా అడిగి తెలుసుకోవచ్చు.
గుర్తుంచుకోండి: పురుషుడి ఆధిపత్యాన్ని ప్రశ్నించకండి లేదా సాధారణంగా పురుషులతో సమానత్వం కోరుకోకండి. ఎందుకంటే, మీరు కోరుకునే మార్పు వల్ల మీ భర్త భయపడే పరిస్థితి ఉండకూడదు.