శరీరం కాలడానికి సర్వసాధారణ కారణాలేమిటి
From Audiopedia - Accessible Learning for All
చిన్న పిల్లలు తీవ్రంగా గాయపడడానికి కారణమయ్యే సర్వసాధారణ అంశాల్లో చర్మం కాలడం మరియు వేడి వస్తువులు తగలడం కూడా ఉన్నాయి. చర్మం కాలడమనేది తరచుగా శాశ్వత మచ్చలకు కారణమవుతుంది మరియు కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. వీటిలో చాలావరకు నిరోధించగలిగినవి.
మంటల్లోకి వెళ్లడం లేదా మంటలు తగలడం లేదా వేడి ఉపరితలాలు తాకడం లాంటివి సర్వసాధారణంగా కాలిన గాయాలకు దారితీస్తుంటాయి.
వేడి ద్రవాలు లేదా ఆహారాలు శరీరం మీద పడడం కూడా కాలిన గాయాలకు ప్రధాన కారణంగా ఉంటుంది.
విద్యుత్తు ఘాతానికి గురికావడం కూడా పిల్లల్లో తీవ్రమైన షాక్ లేదా చర్మం కాలడానికి దారితీయవచ్చు.