శ్లేష్మం పద్ధతి మరియు రోజులు లెక్కింపు పద్ధతి గురించి నేనేం తెలుసుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ఈ పద్ధతుల్లో ఏదైనా ఒకటి ఉపయోగించాలంటే, మీ నెలసరి చక్రంలో మీరు ఎప్పుడు ఫలవంతంగా ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి. దీనినే కొన్నిసార్లు 'ఫలవంతత గురించిన అవగాహన' అని పిలుస్తారు. ఆసమయంలో, గర్భధారణ జరగకుండా నిరోధించడం కోసం మీరు మరియు మీ భాగస్వామి ఆ రోజుల్లో లైంగిక ప్రక్రియలో పాల్గొనకూడదు లేదా కుటుంబ ప్రణాళిక కోసం ఉపయోగించే ఏదైనా అవరోధ పద్ధతి ఉపయోగించాలి.

ఈ పద్ధతులు కోసం ఎలాంటి ఖర్చు ఉండదు మరియు దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు కాబట్టి, ఇతర పద్ధతులు ఉపయోగించలేని లేదా ఇష్టపడని మహిళలు లేదా ఇతర పద్ధతులు అందుబాటులో లేనప్పుడు ఈ పద్ధతులు ఉపయోగించవచ్చు.

మీరు ఎప్పుడు ఫలవంతంగా ఉంటారనే విషయమై మీరు మరింత సమర్థవంతమైన అవగాహన కలిగి ఉండడం కోసం మీరు మరియు మీ భాగస్వామి ఇద్దరూ మీ శరీరాల గురించి మరియు సంతానోత్పత్తి గురించి తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి. ఈ పద్ధతులు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం కోసం సాధారణంగా 3 నుండి 6 నెలల అభ్యాసం అవసరమవుతుంది.

దీని అర్థం ఏమిటంటే: ఈ పద్ధతులన్నింటికీ మనిషి సహకారం అవసరం. లేని పక్షంలో ఇవి ప్రభావవంతంగా పనిచేయవు.

Sources
  • Audiopedia ID: tel020504