సరైన బిందు సేద్యం వ్యవస్థను నేనెలా ఎంచుకోవచ్చు

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

కనీస నిర్వహణ అవసరమయ్యే సరళమైన మరియు సమర్థవంతమైన వ్యవస్థను ఎంచుకోవడమే బిందు సేద్యం వ్యవస్థను ఎంచుకోవడంలో ఉత్తమమైన విధానం కాగలదు. ఈ రకం నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి నిపుణుల సలహా అవసరం. ప్రారంభించడం కోసం మీ వద్ద ఒక ప్రణాళిక ఉండాలి. పొడవైన, నిటారుగా ఉండే సాళ్లు ఏర్పాటు మరింత సమర్థవంతంగా ఉండాలి. తద్వారా, తక్కువ నీటి ఖర్చుతో పాటు వ్యవస్థను సులభంగా అమర్చే అవకాశం ఉంటుంది.

నీటి పారుదల వ్యవస్థను సులభంగా నిర్వహించడం కోసం ఒకే విధమైన నీటి పారుదల అవసరం కలిగిన సమూహాలుగా మీ మొక్కలను వర్గీకరించడమనేది తదుపరి దశగా ఉంటుంది. ప్రతి మొక్క రకానికి సరిపోయే ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించడం కష్టమే అయినప్పటికీ, సమర్థవంతమైన నీటి వ్యవస్థ రూపొందించడానికి మరియు నిర్వహించడానికి కొన్ని సాధారణ మార్గదర్శకాలు ఉపయోగించవచ్చు. బిందు సేద్యం వ్యవస్థ ఏర్పాటు చేసే ముందు పొలంలో మట్టి రకం గురించి తెలుసుకోవాలి.

Sources
  • Audiopedia ID: tel030207