సర్వసాధారణ STIలుగా వేటిని పేర్కొంటారు
అసాధారణ స్రావం: కొన్నికొన్ని సందర్భాల్లో మీ యోని నుండి వచ్చే స్రావం పరిమాణం, రంగు లేదా వాసనలో మార్పు ఉంటే, మీకు ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. అయితే, మీ స్రావం చూడడం ద్వారా ఆ ఇన్ఫెక్షన్ ఏ రకమో చెప్పడం కష్టం.
ట్రైకోమోనాస్: ట్రైకోమోనాస్ అనేది చాలా అసౌకర్యమైన STI. దీనివల్ల వచ్చే స్రావాలు దుర్వాసనతో, ఎర్రటి రంగులో ఉంటాయి మరియు జననేంద్రియ ప్రాంతంలో దురద ఉంటుంది. మీరు మూత్రవిసర్జన చేసేటప్పుడు యోనిలో నొప్పిగా లేదా మంటగా ఉంటుంది. పురుషల్లో ఇది సాధారణంగా ఎలాంటి సంకేతాలు ప్రదర్శించదు. అయితే, వాళ్లు లైంగిక ప్రక్రియలో వారి పురుషాంగం ద్వారా ఈ ఇన్ఫెక్షన్‌ని స్త్రీలోకిపంపగలరు
గజ్జి మరియు పేలు: గజ్జి లేదా పేలు సోకడం వల్ల జననేంద్రియాల దగ్గర్లోని వెంట్రుకల్లో దురద ఏర్పడవచ్చు.
గనేరియా మరియు క్లమీడియా: గనేరియా మరియు క్లమీడియా రెండూ తీవ్రమైన STIలు అయినప్పటికీ, ప్రారంభంలోనే చికిత్స చేస్తే, వాటిని నయం చేయడం సులభమే. ఒకవేళ నియంత్రించకపోతే, మహిళలు మరియు పురుషులు ఇద్దరిలోనూ తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో పాటు వంధ్యత్వం కలిగిస్తాయి.
జననేంద్రియాల మీద పెరుగుదలలు (పులిపిర్లు): పులిపుర్లు వైరస్ ద్వారా వస్తాయి. ఈ పులిపిర్లు కూడా శరీరంలోని ఇతర భాగాల్లో వచ్చే పులిపిర్లు లాగే కనిపిస్తాయి. జననేంద్రియాల్లో పులిపుర్లు ఉన్నప్పటికీ, మరీముఖ్యంగా, పురుషాంగం కొన లోపల ఉన్నప్పుడు ఒక్కోసారి ఆ విషయం తెలియకపోవచ్చు.
జననేంద్రియాల మీద పుండ్లు (అల్సర్లు): పురుషాంగం మీద వచ్చే పుండ్లు లేదా అల్సర్లు చాలావరకు లైంగికంగానే సంక్రమిస్తాయి. ఆ పుండ్లు ఏ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందో తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే సిఫిలిస్ మరియు చాన్‌క్రాయిడ్ రెండింటి వల్ల వచ్చే పుండ్లు తరచుగా ఒకేలా కనిపిస్తాయి.
సిఫిలిస్: సిఫిలిస్ అనేది తీవ్రమైన STI. ఇది శరీర వ్యాప్తంగా ప్రభావాలు చూపగలదు మరియు అనేక సంవత్సరాలు వేధించగలదు. ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది మరియు ప్రారంభంలోనే చికిత్స చేస్తే మందులతో నయం చేయవచ్చు. చికిత్స చేయనప్పుడు, సిఫిలిస్ వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, మానసిక అనారోగ్యం రాగలవు మరియు మరణానికి కూడా దారితీయగలదు.
చాన్‌క్రాయిడ్: చాన్‌క్రాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనివల్ల మర్మాంగాలు లేదా పాయువు వద్ద ఒకటి లేదా ఎక్కువ మృదువైన, బాధాకరమైన పుండ్లు వస్తాయి. ఇవి సులభంగా పగిలిపోయి, రక్తస్రావం జరుగుతుంది. ఉబ్బిన లేదా నొప్పితో కూడిన గ్రంథులు (శోషరస కణుపులు, బృబోస్) గజ్జల్లో పెరుగుతాయి. స్వల్పంగా జ్వరం రావచ్చు.
జననేంద్రియాల హెర్పిస్: జననేంద్రియాల హెర్పెస్ అనేది వైరస్ వల్ల సంక్రమించే STI. దీనివల్ల నెలలు లేదా సంవత్సరాల పాటు మర్మాంగాలు లేదా నోటిలో పుండ్లు రావడం పోవడం జరుగుతుంది. దీనివల్ల జననేంద్రియ ప్రాంతంలో లేదా తొడల మీద చర్మం జలదరింపు, దురద లేదా బాధతో కూడిన అనుభూతి కలుగుతుంది. జననేంద్రియాల మీద చిన్న బొబ్బలు లాంటివి ఏర్పడి, అవి పగలడం వల్ల బాధాకరంగా అనిపిస్తుంది.
HIV ఇన్ఫెక్షన్: HIV వైరస్ అనేది ఎయిడ్స్‌కి కారణమవుతుంది. ఇది చాలావరకు అసురక్షిత లైంగిక చర్య ద్వారానే సంక్రమిస్తుంది. వీర్యం, యోని స్రావాల ద్వారా లేదా HIV సోకిన వారి రక్తాన్ని వేరొకరికి ఎక్కించినప్పుడు సంక్రమిస్తుంది. జననేంద్రియాల మీద పుండ్లు ఉన్నప్పుడు ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపించే అవకాశం ఏర్పడుతుంది. STI మరియు HIV ఉన్న వారి వీర్యం మరియు స్రావాల్లో పెద్ద మొత్తంలో HIV వైరస్ ఉంటుంది. లైంగిక చర్య సమయంలో పురుషుల కంటే మహిళలకు HIV సులభంగా సోకగలదు. పూర్తి ఆరోగ్యంగా కనిపించే వారి నుండి కూడా మీకు HIV సోకవచ్చు.
హెపటైటిస్-బి (పసుపు కళ్లు): హెపటైటిస్-బి అనేది కాలేయానికి హాని కలిగించే వైరస్ వల్ల వచ్చే ప్రమాదకర ఇన్ఫెక్షన్. ఇది ఒక వ్యక్తి నుండి మరొకరికి చాలా సులభంగా వ్యాపిస్తుంది. ప్రత్యేకించి, సెక్స్ సమయంలో సులభంగా వ్యాపిస్తుంది. ఇది సోకినప్పుడు జ్వరం, ఆకలి లేకపోవడం, అలసట మరియు బలహీనత, కళ్లు మరియు/లేదా చర్మం పసుపు రంగులో ఉండడం, కడుపులో నొప్పి, మూత్రం గాఢమైన రంగులో ఉండడం మరియు మలం పాలిపోయినట్లుగా ఉండడం లాంటి లక్షణాలు కనిపించవచ్చు.
గుర్తుంచుకోండి, STIలకు చికిత్స చేసేటప్పుడు, ఎల్లప్పుడూ: