సాంక్రమిక ఇన్ఫెక్షన్లు STIలు విషయంలో నేనేం చేయాలి
హింసాత్మక సెక్స్ సమయంలో యోనిలోని చర్మం సులభంగా రాపిడికి గురవుతుంది కాబట్టి, STIలు మరింత సులభంగా సంక్రమిస్తాయి. మీ మీద అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి STI ఉంటే, అతను దానిని మీకూ అంటించి ఉండవచ్చు. అతనికి వ్యాధి ఉందో, లేదో మీకు తెలియదు కాబట్టి, మీకు వ్యాధి సోకకుండా మరియు మీ నుండి ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు మీరు చికిత్స తీసుకోవాలి. గనేరియా, సిఫిలిస్ మరియు క్లామిడియా కోసం మందులు తీసుకోండి మరియు ఇతర STIల సంకేతాల కోసం చూడండి. మీకు వ్యాధి సోకిందని మీరు భావించినా, భావించకపోయినా మందులు తీసుకోండి.
HIV పరీక్ష చేయించుకోవడానికి కూడా మీరు ప్రయత్నించాలి. HIV సంక్రమణ విస్తృతంగా ఉన్న ప్రాంతాల్లో, HIV సంక్రమణను నివారించడం కోసం అత్యాచారం జరిగిన 24 నుండి 72 గంటల లోపు మందులు తీసుకోవడం మంచిది. మీ ప్రాంతంలో ఏ మందులు సిఫార్సు చేయబడ్డాయో తెలుసుకోవడానికి ఏఆర్టీతో అనుభవం కలిగిన ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఈ మందులు 28 రోజుల పాటు తీసుకోవాలి.