సాధారణంగా నేనెలా మలేరియాను నిరోధించగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

దోమ కాటు ద్వారా మలేరియా వ్యాపిస్తుంది. కాబట్టి, క్రిమిసంహారక మందులతో చికిత్స చేయబడిన దోమల వల లోపల నిద్రపోవడం దోమ కాటు నిరోధించడానికి ఉత్తమ మార్గం కాగలదు.

సమాజంలోని సభ్యులందరినీ, ప్రత్యేకించి చిన్న పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలను దోమ కాటు నుండి రక్షించాలి. సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు మలేరియా దోమలు కుడుతాయి కాబట్టి, ఆ సమయంలో రక్షణ అఅవసరం.

దీర్ఘకాలిక క్రిమిసంహారక-చికిత్స చేసిన దోమల వలలు కనీసం మూడు సంవత్సరాల పాటు రక్షణ అందిస్తాయి మరియు ఆ సమయంలో, వీటిని క్రిమిసంహారక మందులతో మళ్లీ మళ్లీ చికిత్స చేయాల్సిన అవసరం లేదు. మలేరియా నియంత్రణా కార్యక్రమాల్లో భాగంగా ఈ వలలు పంపిణీ చేయబడతాయి. ఆరోగ్య కేంద్రాల ద్వారా లేదా శిశు ఆరోగ్య రోజుల్లో లేదా సమగ్ర ప్రచారాల సమయంలో వీటిని పొందవచ్చు. చాలావరకు, ప్రత్యేకించి, గర్భిణీ స్త్రీలు మరియు చిన్న పిల్లల కోసం దోమల వలలు ఉచితంగా పంపిణీ చేయబడతాయి. మార్కెట్లో లేదా సామాజిక మార్కెటింగ్ కార్యక్రమాల ద్వారా కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఈ విధంగా పొందవచ్చు. చికిత్స చేయని వలలు ఉపయోగంలో ఉన్న సందర్భాల్లో, సురక్షిత పురుగుమందులు మరియు పునర్వినియోగం గురించి శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తల నుండి సలహా పొందవచ్చు.

దోమలు తక్కువగా ఉన్నప్పుడు, పొడి కాలాల్లో కూడా క్రిమిసంహారక-చికిత్స చేసిన దోమల వలలు ఏడాది పొడవునా ఉపయోగించాలి.

కొన్ని దేశాల్లో దోమలు చంపడానికి గృహాల గోడల మీద దీర్ఘకాలిక ప్రభావంతో పనిచేసే పురుగుమందులు పిచికారీ చేసే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంలో, అన్ని ఇళ్ల మీద పిచికారీ చేసేలా స్ప్రే బృందాలకు కమ్యూనిటీలు సహకరించాలి.

కీటక నాశకాల ద్వారా చికిత్స చేయబడిన దోమల వలలు ఉపయోగించడం లేదా దోమల వలలు అందుబాటులో లేకుంటే లేదా ఉపయోగించకపోతే, ఇతర చర్యలు కూడా సహాయపడతాయి కానీ, అవి దోమల వలలు ఉపయోగించినంత ప్రభావవంతంగా ఉండవు:

  • తలుపులు మరియు కిటికీలకు తెరలు కట్టాలి. ఈ పద్ధతి ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉపయోగించబడుతుంది మరియు సాంప్రదాయ గ్రామీణ గృహాలకు ఇది ప్రభావవంతం కాదు
  • దోమల కాయిల్స్ ఉపయోగించినప్పుడు దోమలు పారిపోతాయే తప్ప, చనిపోవు. వీటివల్ల దీర్ఘకాలిక ప్రభావం ఉండదు
  • పొద్దుపోయిన తర్వాత నుండి మర్నాడు తెల్లారే వరకు చేతులు మరియు కాళ్ళను కప్పి ఉంచే దుస్తులు ధరించడం (పొడవాటి చేతులుండే షర్టులు మరియు పొడవాటి ప్యాంటు లేదా స్కర్టులు) వల్ల, మలేరియా దోమలు అధికంగా తిరిగే సమయంలో దోమ కాటును తగ్గించడంలో సహాయపడతాయి.
Sources
  • Audiopedia ID: tel011704