సురక్షితం కాని పని పరిస్థితుల కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నేనెలా నిరోధించగలను
కార్మికులు ఏకమై, మార్పు కోసం డిమాండ్ చేయకపోతే ఈ పరిస్థితుల్లో చాలా వరకు మార్పు కావు. అయితే, మీకు ఎదురుకాగల సమస్యలు నిరోధించడం కోసం మీరు చేయగల కొన్ని పనులు ఇక్కడ ఉన్నాయి:
మీరు కొత్త పని ప్రారంభించినప్పుడు, అన్ని పరికరాలు మరియు రసాయనాలు సురక్షితంగా ఉపయోగించడం గురించి మీ బాస్ లేదా సూపర్వైజర్ నుండి సూచనలు పొందండి. అలాంటి పరికరం లేదా అలాంటి రసాయనాలు ఉపయోగించిన అనుభవం కలిగిన మహిళల నుండి ఎల్లప్పుడూ సలహా అడగండి.
సాధ్యమైనప్పుడల్లా, పెద్ద శబ్దాల నుండి రక్షణ కోసం టోపీలు, ముసుగులు, చేతి తొడుగులు లేదా ఇయర్ ప్లగ్‌లు లాంటి రక్షణ పరికరాలు ధరించండి. యంత్రాలతో పని చేసేటప్పుడు, వదులుగా ఉండే దుస్తులు ధరించకండి. పొడవాటి జుట్టును ముడి వేసుకోండి మరియు కప్పుకోండి.
మీ పని ప్రదేశం వేడిగా ఉంటే, పుష్కలంగా ద్రవాలు త్రాగండి మరియు ఉప్పు కలిగిన ఆహారాలు తినండి. మీరు గర్భవతిగా ఉంటే ఈ రెండూ తప్పకు చేయండి. పురుషుల కంటే మహిళలకు వేడి దెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.