సురక్షితమైన లైంగిక సంబంధం గురించి నేను నా భాగస్వామితో ఏవిధంగా మాట్లాడగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

మీ లైంగిక సంబంధం సురక్షితమైనదిగా ఉండడంలో మీ భాగస్వామి కూడా మద్దతు అందిస్తారని మీరు భావిస్తే, STIsల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాల గురించి మీరిద్దరూ కలిసి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. అయితే, ఇది ఎల్లప్పుడూ సులభం కాకపోవచ్చు! భాగస్వాములతో లేదా ఇతర పురుషులతో సెక్స్ గురించి మాట్లాడటం 'సరైనది కాదు' అని చాలామంది మహిళలకు అప్పటికే బోధించి ఉంటారు. కాబట్టి వారికి ఆవిధమైన పరిస్థితి ఉండదు. సెక్స్ గురించి ఒక పురుషుడు ఇతర పురుషులతో మాట్లాడుతాడు కానీ, తన భాగస్వామితో మాట్లాడడానికి మాత్రం తరచుగా అసౌకర్యంగా భావిస్తాడు. అలాంటప్పుడు ఇక్కడ పేర్కొన్న సూచనలు పాటించండి:

  • భద్రత మీద దృష్టి పెట్టండి. సురక్షిత లైంగిక సంబంధం గురించి మాట్లాడినప్పుడు, నువ్వు నన్ను నమ్మడం లేదా అని మీ భాగస్వామి కోప్పడవచ్చు. అయితే, ఇక్కడ సమస్య భద్రత గురించే తప్ప, నమ్మకం గురించి కాదు. ఒక వ్యక్తికి అతనికి తెలియకుండానే STI ఉండవచ్చు లేదా సెక్స్ ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో వారికి HIV సోకి ఉండవచ్చు. కాబట్టి, తనకు ఇన్ఫెక్షన్ సోకలేని అతను లేదా ఆమె నిర్ధారించడం కష్టం. భాగస్వాములిద్దరూ పరస్పరం మాత్రమే సెక్సులో పాల్గొంటున్నప్పటికీ, సురక్షిత సెక్స్ అభ్యాసం అనేది ప్రతి జంటకు ఒక మంచి ప్రవర్తన కాగలదు.
  • ఈ విషయమై ముందుగా ఒక ఫ్రెండ్‌తో మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. మీ భాగస్వామిగా నటించాల్సిందిగా ఆ ఫ్రెండ్‌ని అడగండి. ఆ తర్వాత, మీరేం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని సాధన చేయండి. అతను చెప్పగల వివిధ విషయాల గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి మరియు అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని సాధన చేయండి. మాట్లాడడానికి సైతం అతను భయపడే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. కాబట్టి, అతన్ని సౌకర్యంగా ఉంచే ప్రయత్నం చేయండి.
  • సెక్స్ గురించి మాట్లాడాలంటే, సెక్స్ కోసం దగ్గరయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు పరస్పరం మంచి అనుభూతితో ఉన్న సమయం ఎంచుకోండి. మీకు కొత్తగా శిశువు పుట్టిన కారణంగాలేదా STIకి చికిత్స తీసుకుంటున్న కారణంగా, మీరు సెక్స్ ఆపేసి ఉంటే, మళ్లీ సెక్స్ మొదలుపెట్టడానికి ముందు ఆ విషయమై మాట్లాడండి. మీరు, మీ భాగస్వామి దూరదూరంగా ఉంటుంటే, తరచుగా ప్రయాణాలు చేస్తుంటే, మీ లైంగిక ఆరోగ్యాన్ని రక్షించుకునే విషయమై ఇద్దరూ మాట్లాడుకోండి.
  • అసురక్షిత లైంగిక ప్రక్రియ వల్ల వచ్చే ప్రమాదాల గురించి మరియు సురక్షిత లైంగిక సంబంధం గురించి మీకు వీలైనంతగా తెలుసుకోండి. STIలు గురించి, అవి ఎలా వ్యాప్తి చెందుతాయి మరియు వాటి వల్ల తలెత్తే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాల గురించి మీ భాగస్వామికి పెద్దగా తెలియకపోతే, అసురక్షిత లైంగిక సంబంధంలోని నిజమైన ప్రమాదాలు గురించి అతను అర్థం చేసుకోకపోవచ్చు. సురక్షిత లైంగిక అభ్యాసం అవసరం గురించి అతడిని ఒప్పించడానికి ఈ సమాచారం సహాయపడుతుంది.
  • ఇతర వ్యక్తులను ఉదాహరణలుగా ఉపయోగించండి (\"తానెప్పుడూ కండోమ్ ఉపయోగిస్తానని నా సోదరుడు నాకు చెప్పాడు\"). ఇతరులు సురక్షిత లైంగిక అభ్యాసం చేస్తున్నారని తెలుసుకోవడం వల్ల మీ భాగస్వామి తాను కూడా అలా చేసేందుకు ప్రభావితం కావచ్చు.
Sources
  • Audiopedia ID: tel010510