సురక్షిత సెక్స్‌ని నేను ఏవిధంగా కొనసాగించాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

హెచ్ఐవి మరియు ఇతర సాంక్రమిక ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి: మీ భాగస్వామి మర్మాంగం మీకు తగలడానికి ముందే దానికి రబ్బరు కండోమ్ తొడగండి.

సెక్స్ కారణంగా తరచుగా ప్రమాదాలు ఉంటాయి. అయితే, దానిని సురక్షితంగా చేయడానికి మార్గాలు కూడా ఉన్నాయి. తక్కువ ప్రమాదం అనేది ప్రమాదం లేకపోవడానికి సమానం కాదని వ్యక్తులకు గుర్తు చేయడం కోసమే \"సురక్షితమైన\" సెక్స్ అని మేము చెబుతుంటాము. ఎందుకంటే, సురక్షిత సెక్స్ మీ ప్రాణాలు కాపాడగలదు.

తాను ఎంత మేరకు ప్రమాదం అంగీకరించడానికి సిద్ధంగా ఉంది, సురక్షితంగా ఉండటానికి తాను ఏయే చర్యలు తీసుకోగలదో ప్రతి స్త్రీ నిర్ణయించుకోవాలి. మహిళలు వారి ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి క్రింద పేర్కొన్న విధంగా విభిన్న మార్గాలున్నాయి:

అత్యంత సురక్షితం:

  • అస్సలు సెక్స్ జోలికే వెళ్లకండి. మీరు సెక్స్ చేయకపోతే, మీకు STIలు వచ్చే అవకాశమే ఉండదు. కొంతమంది మహిళలకు, ప్రత్యేకించి, వాళ్లు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇది వాళ్లకి ఉత్తమ ఎంపిక కాగలదు. అయితే చాలామంది మహిళలకు, ఈ ఎంపిక సాధ్యం కాదు లేదా వాంఛనీయం కాదు.
  • మీతో మాత్రమే అతనికి లైంగిక సంబంధం ఉందని మీకు ఖచ్చితంగా తెలిసిన ఒకే ఒక వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోండి. అలాగే, గత భాగస్వాముల కారణంగా, మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకలేదని నిర్ధారించుకోండి. అయితే, STIల కోసం పరీక్షలు చేసుకుంటేనే ఈ విషయం నిర్ధారించగలరు
  • మీ చేతులతో మర్మాంగాలు తాకడం (పరస్పర హస్త ప్రయోగం) ద్వారా, సెక్స్ ముగించండి.
  • ఓరల్ సెక్స్ సమయంలో కండోమ్ ఉపయోగించండి. లేటెక్స్ లేదా ప్లాస్టిక్ అవరోధం ఉండడం వల్ల నోటిలో హెర్పెస్ మరియు గనేరియా సంక్రమణ నివారించడంలో సహాయపడుతుంది. నోటిలోని చిన్న చిన్న కోతల ద్వారా HIV సంక్రమించే అతితక్కువ ప్రమాదం నుండి కూడా ఇది మిమ్మల్ని రక్షిస్తుంది.

సురక్షితం:

  • యోని లేదా పాయువులో సెక్స్ సమయంలో ఎల్లప్పుడూ లేటెక్స్ కండోమ్‌లు - పురుషుడు లేదా మహిళ - ధరించండి.
  • మీ భాగస్వామి శరీర ద్రవాలు మీ యోని లేదా పాయువులోకి వెళ్లకుండా నిరోధించే మార్గాల్లో సెక్స్ చేయండి. నోటితో సెక్స్ ద్వారా HIV సంక్రమణ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. మీ నోట్లోకి వీర్యం వస్తే, వెంటనే దానిని ఉమ్మేయండి (లేదా మింగేయండి).

ప్రమాదం తగ్గించే ఇతర మార్గాలు:

  • వీర్యం స్కలించడానికి ముందే పురుషుడు తన అంగం బయటకు తీసేయాలి. అయితే, అలా చేసినప్పటికీ, అతనికి HIV ఉంటే, మీకు అది సోకవచ్చు. అలాగే, మీరు గర్భవతి అయ్యే అవకాశమూ ఉంటుంది. అయితే, మీ శరీరంలోకి తక్కువ వీర్యమే వెళ్తుంది కాబట్టి, ఆ అవకాశం తక్కువే.
  • డయాఫ్రాగమ్ ఉపయోగించడం వల్ల మీ ప్రమాదం తగ్గే అవకాశం ఉంది.
  • డ్రై సెక్స్ నివారించండి. యోని (లేదా పాయువు) పొడిగా ఉన్నప్పుడు సెక్స్ చేస్తే, లోపలి భాగాలు సులభంగా కోసుకుంటాయి మరియు ఇన్ఫెక్షన్ అవకాశాలూ పెరుగుతాయి. యోనిలో తడి పెంచడానికి ఎంగిలి (ఉమ్మి), స్పెర్మిసైడ్ లేదా లూబ్రికెంట్ ఉపయోగించండి. మీరు కండోమ్ ఉపయోగిస్తుంటే నూనె, లోషన్ లేదా పెట్రోలియం జెల్ ఉపయోగించకండి - ఇవి కండోమ్‌ చిరిగిపోయేలా చేయగలవు.
  • మీకు ఏవైనా STIలు ఉంటే చికిత్స పొందండి. ఒక STI ఉన్నా సరే, HIV లేదా ఇతర STIలు సులభంగా సోకగలవు.
Sources
  • Audiopedia ID: tel010509