సెక్స్ కోసం నేను సిద్ధమైనప్పుడు నన్ను నేను ఎలా రక్షించుకోగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

సెక్స్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారనుకుంటే, గర్భం మరియు వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. సురక్షితంగా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంటే, సెక్స్ సంబంధానికి ముందే మీరు మీ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

మీరు సెక్స్ బంధానికి సిద్ధమయ్యే ముందు మీ ప్రియుడితో మాట్లాడండి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ఎంత ముఖ్యమో అతనికి తెలియజేయండి. చర్చించడం మీకు కష్టంగా అనిపిస్తే, వేరొక జంట గురించి మాట్లుడుతున్నట్టుగా మీరు మొదట్లో నటించవచ్చు. అతను నిజంగానే మీ గురించి శ్రద్ధ వహిస్తుంటే, అతను మీ రక్షణకు ప్రాముఖ్యం ఇస్తాడు. ఒకవేళ సెక్స్ కోసం మాత్రమే ఆలోచిస్తుంటే, అతని గురించి మాత్రమే పట్టించుకుంటాడు.

అనేక సమాజాల్లో కండోమ్‌లు మరియు ఇతర కుటుంబ నియంత్రణ పద్ధతులు అందించడం కోసం శిక్షణ పొందిన వ్యక్తులు ఉంటారు. వారితో మాట్లాడండి లేదా రక్షణ పద్ధతి ఎక్కడ లభిస్తుదో ఆరోగ్య కార్యకర్తను అడగండి. అడగడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే, మీకు సహాయం చేయడానికి మీరు విశ్వసించే వ్యక్తిని ఆశ్రయించండి. కొన్ని కుటుంబ నియంత్రణ ఆసుపత్రుల్లో టీనేజర్ల కోసం ప్రత్యేక సేవలు ఉంటాయి మరియు మీకు సమాచారం అందించడానికి అక్కడ శిక్షణ పొందిన టీనేజర్లు అందుబాటులో ఉండవచ్చు.

ఒక వ్యక్తికి ఏదైనా ఇన్ఫెక్షన్ గానీ, HIV గానీ ఉందా అని వాళ్లని చూడగానే మీరు చెప్పలేరు. కాబట్టి, మీరు ప్రతిసారీ కండోమ్ ఉపయోగించడమే సురక్షితం. పురుషుడికి అంగం నుండి స్రావం వస్తుంటే దాని మీద ఏదైనా గాయం ఉందంటే, అతనికి ఇన్ఫెక్షన్ ఉంది మరియు దాదాపు ఖచ్చితంగా అది మీకు సోకుతుందని అర్థం! మీరు సెక్స్‌లో పాల్గొన్న తర్వాత, మీకు యోని నుండి కొత్తగా ఏదైనా స్రావం రావడం, మీ జననేంద్రియాల మీద పుండ్లు లేదా మీ పొత్తి కడుపులో నొప్పి వస్తే, మీకు STI వచ్చి ఉండవచ్చు.

Sources
  • Audiopedia ID: tel020812