సెక్స్ పరమైన సంఘర్షణలను నేనెలా ఎదుర్కోగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

సెక్స్ కోరిక అనేది జీవితంలో ఒక సహజమైన భాగం మరియు పురుషుడిలాగే ఒక స్త్రీ కూడా ఎక్కువ కోరికను మరియు ఆనందాన్ని అనుభవించగలదు. అయితే, సాంప్రదాయకంగా మహిళలు తమ భర్త డిమాండ్లకు లొంగి ఉండడమే భార్యగా వారి కర్తవ్యం అని, 'మంచి' మహిళలకు వారి స్వంత కోరికలు ఉండవని తరచుగా బోధిస్తుంటారు. అయితే, ఇదొక తప్పు మరియు హానికర బోధన. మహిళలు మరియు పురుషులు ఇద్దరూ తమ భాగస్వాములతో ఆనందం పంచుకోవాలనుకోవడం మంచి విషయం మరియు సహజమైన విషయం. తమ భాగస్వామికి ఇష్టమైన విధంగా మాట్లాడడం మరియు తాకడం ప్రతి భాగస్వామికి తెలిసినప్పుడు వారిద్దరూ మరింతగా ఆనందించవచ్చు.

సెక్స్ గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. గతంలో మీరెప్పుడూ ఆ విషయం మాట్లాడి ఉండకపోతే, అది మీకు చాలా కష్టంగా ఉంటుంది. అయితే, మీరు ఆ విషయం మాట్లాడడం చాలా ముఖ్యం. మీరు అలా చేయకపోతే, మీరు మీ సెక్స్ జీవితాన్ని ఆస్వాదించడం లేదని అతనికి ఎలా తెలుస్తుంది? మీకు ఏది నచ్చిందో, ఏది నచ్చలేదో అతనికి చెప్పండి. సెక్స్ పరమైన స్పర్శకు తన శరీరం కంటే భిన్నంగా మీ శరీరం స్పందిస్తుందని మీ భాగస్వామి గ్రహించకపోవచ్చు. మీకు ఉత్సాహం ఎలా కలిగించాలో అతనికి నేర్పండి. సెక్స్ అనేది తరచుగా ఒక వ్యక్తిని ఉత్సాహపరిచేలా ముద్దు పెట్టుకోవడం, తాకడం, మాట్లాడటం లేదా చూడడం లాంటి వాటితో ప్రారంభమవుతుంది. ఒక మహిళలో ఉత్సాహం మొదలుకావడానికి లేదా ఆమె ఆ స్థితికి చేరుకోవడానికి తరచుగా పురుషుడి కంటే ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, మీకోం సమయం వెచ్చించాలని మరియు మీతో ఉన్నప్పుడు ఓపికగా ఉండాలని మీ భాగస్వామికి చెప్పండి.

దాదాపుగా మహిళలందరిలోనూ ఉద్వేగం కలిగించడం సాధ్యమే. కానీ, చాలామంది మహిళలకు అవి ఎప్పుడూ ఉండవు లేదా అప్పుడప్పుడూ మాత్రమే ఉంటాయి. ఒక మహిళ కోరుకుంటే, తనలో ఎలా ఉద్వేగం కలిగించాలో తెలుసుకోవచ్చు. తనకు తానే ప్రేరేపించుకోవడం ద్వారా లేదా తనకు ఏది ఇష్టమో భాగస్వామితో చెప్పడం ద్వారా ఆమె ఆవిధంగా చేయవచ్చు. స్పర్శ మాత్రమే సెక్స్ కోరికకు కారణ కాదు. ఒక మహిళ తన శరీరం గురించి తెలుసుకుంటే మరియు ఏ రకమైన స్పర్శ ఆమెకి ఉత్తమంగా అనిపిస్తుందో తెలుసుకుంటే, ఆమెలో ఉద్వేగం సాధ్యమవుతుంది. తనకు ఎలాంటి స్పర్శ ఉద్వేగం కలిగిస్తుందో భాగస్వామికి చెప్పగలదు.

ఒక మహిళలో కలిగే ఉద్వేగం అనేది ఆమె నెలసరి చక్రం వ్యాప్తంగా లేదా ఆమె జీవితంలో నిర్థిష్ట సమయాల్లో మారవచ్చు. మీకు లేదా మీ భాగస్వామికి సెక్స్ ఇష్టం లేకపోతే, పరస్పరం మన్నించుకోవడానికి మరియు దాని గురించి మాట్లాడటానికి ప్రయత్నించండి. మీ ఇద్దరికీ ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే దానికి సిద్ధమవ్వండి. మీ ఇద్దరికీ ఉత్తేజకరంగా అనిపించే పనులు చేయడానికి ప్రయత్నించండి.


సెక్స్ అనేది ఎప్పుడూ బాధాకరమైనదిగా ఉండకూడదు. సెక్స్ సమయంలో నొప్పి అనేది సాధారణంగా ఏదో సమస్య ఉందనేందుకు సంకేతం లాంటిది. క్రింది పరిస్థితుల్లో మహిళకు సెక్స్ సమయంలో నొప్పిగా అనిపించవచ్చు:

  • ఆమె ప్రశాంతంగా మారడంతో పాటు ఆమెలో తడి రాకముందే ఆమె భాగస్వామి అంగప్రవేశం చేయడం.
  • ఆమె అపరాధభావంతో లేదా సిగ్గుపడుతూ లేదా సెక్స్ వద్దనే స్థితిలో ఉన్నప్పుడు.
  • ఆమెకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు (పరీక్ష కోసం మీరు ఆరోగ్య కార్యకర్త వద్దకు వెళ్లాలి).
  • ఆమె జననేంద్రియాల్లో గాయాలు ఉన్నప్పుడు.

గుర్తుంచుకోండి: మీ భర్త మీకు ద్రోహం చేస్తున్నాడని మీకు అనుమానం వస్తే లేదా తెలిస్తే, అతను కండోమ్ ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటే తప్ప అతనితో సెక్స్‌కి సిద్ధం కాకండి. అతను ఇతరులతో సెక్స్ సంబంధాలు కలిగి ఉంటే, అతని ద్వారా మీకు HIV/AIDS లాంటి STIలు (లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు) సోకవచ్చు. పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ STIలు సోకవచ్చు. అయితే, ఒక పురుషుడికి ఒక మహిళ నుండి సంక్రమించే దానికంటే ఒక మహిళకి ఒక పురుషుడి నుండి సులభంగా ఇన్ఫెక్షన్ సంక్రమిస్తుంది. కాబట్టి, మీకే ఎక్కువ ప్రమాదం ఉంటుంది.

Sources
  • Audiopedia ID: tel021013