సెక్స్ సంబంధితంగా తలెత్తే సంఘర్షణలేమిటి
తమ భార్యలు కుటుంబ నియంత్రణ ఉపయోగించడం కొందరు పురుషులకు ఇష్టం ఉండదు. అదేసమయంలో, వివిధ కుటుంబ నియంత్రణ పద్ధతులు ఎలా పనిచేస్తాయనే దాని గురించి వాళ్లకి పెద్దగా అవగాహన ఉండదు. అలాగే, కుటుంబ నియంత్రణ పద్ధతులు వల్ల కలిగే ప్రమాదాల గురించి కథలు విని ఉండడం వల్ల తమ భార్యల ఆరోగ్యం గురించిన ఆందోళన కారణంగా కూడా వాళ్లు కుటుంబ నియంత్రణ పద్ధతుల విషయంలో విముఖంగా ఉండొచ్చు. ఒక మహిళ కుటుంబ నియంత్రణ ఉపయోగిస్తే, ఆమె ఇతర పురుషులతో సెక్స్ సంబంధం పెట్టుకుంటుందనే అనుమానం లేదంటే చాలామంది పిల్లలు ఉండడం తమ 'పురుషత్వానికి' ప్రతీక అని వాళ్లు అనుకోవచ్చు.
చాలా దేశాల్లో నేటికీ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే ఎక్కువగా ఉంటున్నాయి. పెళ్లి తర్వాత ఏం జరుగుతుందనే విషయమై వధువు మరియు వరుడుకి పెద్దగా తెలిసి ఉండదు లేదా ఎవరూ ఏమీ చెప్పరు మరియు పెళ్లి తర్వాత, యువతులు తరచుగా వారి స్వంత కుటుంబాల నుండి దూరంగా వచ్చేస్తారు. అనేక సమాజాల్లో, పెళ్లి తర్వాత స్త్రీ తన భర్తకు ఆస్తి అవుతుంది. కాబట్టి, పెళ్లి తర్వాత, అతను కోరుకున్నప్పుడల్లా తన ఆనందం కోసం స్త్రీ శరీరం ఉపయోగించుకునే హక్కు తనకు ఉందని అతను నమ్ముతాడు.
ఈ పరిస్థితుల్లో, చాలామంది మహిళలు తమ భర్తను ప్రేమించడం మరియు అతనితో సెక్స్ ఆనందించడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి, తమకు పెద్దగా పరిచయం లేని లేదా బహుశా ఇష్టం లేని వ్యక్తితో సెక్స్ కోసం తమ మీద ఒత్తిడి తెస్తున్నట్లు వాళ్లు భావించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో, వాళ్లు తమ భర్తను తిరస్కరించవచ్చు లేదా అతనితో సెక్స్ తప్పించుకోవడం కోసం సాకులు వెతుకుతూ ఉండవచ్చు. ఇలా జరిగినప్పుడు భర్తలకు కోపం వచ్చి, సెక్స్ కోసం భార్య మీద మరింత ఒత్తిడి చేయవచ్చు. ఇది ఒక \"దుర్మార్గపు వలయానికి\" దారితీస్తుంది. దీంతో, మహిళలు తమ భర్త మీద మరింతగా ఆగ్రహిస్తారు, వారిని తిరస్కరిస్తారు.
కొంతమంది వివాహిత పురుషులు తాము ఎంచుకున్నప్పుడల్లా ఇతర మహిళలతో కలిసి ఉండడానికి తమకు హక్కు ఉందని, అయితే, తమ భార్యలు మాత్రం అలా చేయకూడదని భావిస్తుంటారు.