స్త్రీలో వంధ్యత్వానికి కారణమేమిటి
స్త్రీలో వంధ్యత్వానికి ప్రధాన కారణాలు ఏమిటంటే:
ఆమె ట్యూబుల్లో లేదా ఆమె గర్భాశయం లోపల గాయాలు ఉండడం. ట్యూబుల్లో గాయాలనేవి అండం ట్యూబ్‌లో స్వేచ్ఛగా కదలకుండా నిరోధించవచ్చు లేదా వీర్యకణాలేవీ అండం వైపు ఈదుకుంటూ వెళ్లకుండా నిరోధించవచ్చు. గర్భాశయంలో గాయాల వల్ల ఫలదీకరణ చెందిన అండం గర్భాశయం గోడకు అంటుకోకుండా నిరోధించవచ్చు. కొన్నిసార్లు స్త్రీ గర్భాశయంలో సమస్య ఉన్నప్పటికీ, ఆమెకు ఎలాంటి అనారోగ్యం ఉండదు కాబట్టి, ఆ విషయమే ఆమెకి తెలియదు. కానీ, ఆమెకి వంధ్యత్వం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విషయం గ్రహిస్తుంది.
గాయాలు ఏర్పడడానికి క్రింది అంశాలు కారణం కావచ్చు:
ఆమెలో అండాలు ఉత్పత్తి కాకపోవడం (అండోత్సర్గము లేకపోవడం). శరీరంలో సరైన సమయంలో అవసరమైన హార్మోన్లు తగినంతగా తయారు కాకపోవడం దీనికి కారణం కావచ్చు. ఆమెకు నెలసరి రక్తస్రావం 25 రోజుల కంటే తక్కువ వ్యవధిలో లేదా 35 రోజుల కంటే ఎక్కువ వ్యవధిలో ఉండడమనేది ఆమెలో అండోత్సర్గ సమస్యకు కారణం కావచ్చు. కొన్నిసార్లు ఒక మహిళ చాలా త్వరగా బరువు తగ్గితే లేదా ఆమె ఎక్కువ బరువు పెరిగితే ఆమెలో అండాలు ఉత్పత్తి కావు.
ఆమె గర్భాశయంలో పెరుగుదలలు (ఫైబ్రాయిడ్లు) ఉండడం. ఫైబ్రాయిడ్‌లనేవి గర్భధారణను నిరోధించగలవు లేదా గర్భం దాల్చడాన్ని కష్టతరం చేయగలవు. HIV, డయాబెటిస్, క్షయ మరియు మలేరియా లాంటి వ్యాధులు కూడా స్త్రీలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గించగలవు. కుటుంబ నియంత్రణ పద్ధతులు వంధ్యత్వానికి కారణమవుతయనే అపవాదు తరచూ వినిపిస్తుంటుంది. అయితే, కుటుంబ నియంత్రణ పద్ధతులు (స్టెరిలైజేషన్ కాకుండా ఇతరాలు) వంధ్యత్వానికి కారణం కావు. కొన్ని సందర్భాల్లో IUDని సరిగ్గా అమర్చకపోవడం మరియు గర్భాశయం లేదా ట్యూబుల్లో ఇన్ఫెక్షన్‌కి దారితీసినప్పుడు మాత్రమే ఈ మాట నిజం కాగలదు.