స్పెర్మిసైడ్‌ని నేనెలా ఉపయోగించాలి
1. సబ్బు మరియు నీటితో చేతులు కడుక్కోండి.
2. ఫోమ్ ఉపయోగించడానికి, ఫోమ్ కంటైనర్‌ని దాదాపు 20 సార్లు వేగంగా కదిలించండి. ఆ తర్వాత, అప్లికేటర్‌ని నింపడానికి నాజిల్ నొక్కండి.
జెల్లీ లేదా క్రీమ్ ఉపయోగించడం కోసం, స్పెర్మిసైడ్ ట్యూబ్‌ని అప్లికేటర్ మీద తిప్పండి. స్పెర్మిసైడ్ ట్యూబ్ నొక్కడం ద్వారా అప్లికేటర్‌ని నింపండి.
యోనిలో పెట్టే మాత్రలు ఉపయోగించడానికి, వాటి మీది కవర్ తీసివేసి, అది తడిగా మారడం కోసం నీళ్లు లేదా ఉమ్మి వేయండి. (మాత్రను నోట్లో పెట్టకండి.)
3. అప్లికేటర్ లేదా యోని టాబ్లెట్‌ని మీ యోనిలోకి పెట్టి, దానిని ఎంత లోపలకు నెట్టగలిగితే అంత లోపలకు నెట్టండి.
4. మీరు అప్లికేటర్ ఉపయోగిస్తుంటే, ప్లంజర్‌ని అన్నివైపులకు తిప్పండి. ఆ తర్వాత, ఖాళీ అప్లికేటర్‌ని బయటకు తీసేయండి.
5. అప్లికేటర్‌ని శుభ్రమైన నీరు మరియు సబ్బుతో కడగండి.
6. సెక్స్ తర్వాత కనీసం 6 గంటల పాటు స్పెర్మిసైడ్‌ని అదే స్థానంలో ఉంచండి. స్పెర్మిసైడ్‌ని కడిగేయకండి లేదా వాష్ చేయకండి. మీ యోని నుండి క్రీమ్ బయటకు కారుతుంటే, అది మీ దుస్తుల మీద పడకుండా ఉండడం కోసం ప్యాడ్, పత్తి లేదా శుభ్రమైన వస్త్రం అడ్డుపెట్టుకోండి.