స్పెర్మిసైడ్ గురించి నేనేం తెలుసుకోవాలి గర్భనిరోధక ఫోమ్ మాత్రలు జెల్లీ లేదా క్రీమ్
స్పెర్మిసైడ్ అనేక రూపాల్లో-ఫోమ్, మాత్రలు మరియు క్రీమ్ లేదా జెల్లీ-లభిస్తుంది మరియు సెక్స్ చేయడానికి ముందు దీన్ని యోనిలో ఉంచుకోవాలి. స్పెర్మిసైడ్ అనేది పురుషుడి వీర్యం గర్భాశయంలోకి ప్రవేశించడానికి ముందే అందులోని వీర్యకణాలను చంపేస్తుంది.
స్పెర్మిసైడ్ మాత్రమే ఉపయోగిస్తే, కొన్ని ఇతర పద్ధతుల కంటే ఇది తక్కువ ప్రభావవంతంగానే ఉంటుంది. అయితే, డయాఫ్రాగమ్ లేదా కండోమ్ లాంటి మరొక పద్ధతితో పాటు అదనపు రక్షణగా ఉపయోగించినప్పుడు అత్యంత సహాయకరంగా ఉంటుంది.
స్పెర్మిసైడ్లను అనేక మందుల దుకాణాలు మరియు మార్కెట్లలో కొనుగోలు చేయవచ్చు. కొన్ని రకాల స్పెర్మిసైడ్‌ల వల్ల యోని లోపల దురద లేదా చికాకు కలుగుతున్నట్టు కొంతమంది మహిళలు పేర్కొన్నారు.
స్పెర్మిసైడ్లు ఏ STI నుండి రక్షణ అందించవు. స్పెర్మిసైడ్లు యోని గోడల మీద చికాకు కలిగించగలవు కాబట్టి, వాటి వల్ల యోని గోడల మీద సూక్ష్మమైన కోతలు ఏర్పడినప్పుడు HIV వైరస్ మరింత సులభంగా రక్తంలోకి చేరగలదు.
స్పెర్మిసైడ్‌ని ఎప్పుడు చొప్పించాలి: సెక్స్‌కి 10 నుండి 15 నిమిషాల ముందు స్పెర్మిసైడ్ మాత్రలు లేదా సపోజిటరీలను యోనిలో ఉంచాలి. ఫోమ్, జెల్లీ లేదా క్రీమ్ లాంటివి లైంగిక సంబంధానికి ముందు యోనిలో ఉంచితే ఉత్తమంగా పనిచేస్తాయి.
సెక్స్‌కి ముందు ఒక గంట కంటే ఎక్కువ సమయం గడిస్తే, మరింత స్పెర్మిసైడ్‌ని యోనిలోకి చొప్పించాలి. మీరు సెక్స్ చేసిన ప్రతిసారి ఒక కొత్త టాబ్లెట్, సపోజిటరీ లేదా ఫోమ్, జెల్లీ లేదా క్రీమ్ ఉపయోగించండి.