హింస కొనసాగే తీరు గురించి నేనేం తెలుసుకోవాలి
మొదటి హింసాత్మక దాడి తరచుగా అప్పటికప్పుడు జరిగిన సంఘటనలా అనిపిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో, మొదటిసారిగా హింస జరిగిన తర్వాత, అది ఈ క్రింది నమూనా లేదా చక్రీయంలో మరింత తీవ్రమవుతుంది:
హింస జరుగుతుంది: కొట్టడం, చెంపమీద కొట్టడం, తన్నడం, గొంతు నొక్కడం, వస్తువులు లేదా ఆయుధాల వాడడం, లైంగిక దుర్వినియోగం, మాటలతో బెదిరించడం మరియు ఇతర రకాల దుర్వినియోగాలు. హింస తర్వాత ప్రశాంతత: హింస జరిగినప్పటికీ, ఆ వ్యక్తి దానిని తిరస్కరించవచ్చు, క్షమాపణ కోరవచ్చు లేదా అది మళ్లీ జరగదని వాగ్దానం చేయవచ్చు. ఆతర్వాత, మళ్లీ నెమ్మదిగా ఉద్రిక్తత పెరుగుతుంది: కోపం, వాదన, నిందించడం, అరుపులు పెరిగి, మళ్లీ హింస జరుగుతుంది....
హింస వ్యవధి పెరిగే కొద్దీ, చాలా జంటల విషయంలో ప్రశాంతమైన కాలం తక్కువగా, మరింత తక్కువగా ఉంటుంది. స్త్రీ పూర్తిగా ధైర్యం కోల్పోయిన పరిస్థితిలో, ఆమె మీద పురుషుడి నియంత్రణ సంపూర్ణంగా మారుతుంది. అటుపై, పరిస్థితులు మెరుగుపడతాయని వాగ్దానం చేసే అవసరం కూడా అతడికి ఉండదు.
హింస జరగడానికి కొందరు మహిళలు ప్రేరేపించినప్పుడు, వాళ్ల ప్రశాంత జీవితం మరింత త్వరగా ముగుస్తుంది. మరింత త్వరగా హింస మొదలవుతుంది.