హింస సంబంధిత హెచ్చరిక సంకేతాల గురించి నేను ఏం తెలుసుకోవాలి
From Audiopedia - Accessible Learning for All
సంబంధం దుర్వినియోగమై అది హింసాత్మకంగా మారినప్పుడు, దానిని వదిలి పెట్టడం చాలా కష్టం. ఒక స్త్రీ ఎంత ఎక్కువ కాలం బంధంలో ఉంటే, పురుషుడికి ఆమె మీద అంత ఎక్కువ నియంత్రణతో ఉంటాడు మరియు ఆమె మీద ఆమెకు అదే స్థాయిలో విశ్వాసం తక్కువగా ఉండొచ్చు. ఈ పరిస్థితిలో ఇతరుల కంటే పురుషులు హింసాత్మకంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి హింసాత్మకంగా ఉండొచ్చని సూచించే కొన్ని సంకేతాలు ఉన్నాయి. మీకు ఈ సంకేతాలు ఎదురైనప్పుడు ఆ సంబంధం నుండి బయటపడే మార్గం గురించి జాగ్రత్తగా ఆలోచించండి.
మీరు ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నారనేది ముఖ్యం కాదు. ఎందుకంటే, ప్రేమ అనేది ఎవరినీ మార్చదు. తాను మారాలని ఆ వ్యక్తి నిర్ణయించుకున్నప్పుడే ఆ మార్పు సాధ్యం కాగలదు.