హింస సమయంలో నా భద్రత కోసం నేనేం చేయవచ్చు
From Audiopedia - Accessible Learning for All
అతను హింసాత్మకంగా మారబోతున్నాడని మీరు గ్రహించినప్పుడు, మీకు హాని తలపెట్టేలా అతను ఆయుధాలు లేదా వస్తువులు ఉపయోగించలేని మరియు మీరు తప్పించుకునే అవకాశం ఉన్న చోటుకి వెళ్లిపోయే ప్రయత్నం చేయండి.
మీ ఉత్తమ తీర్పు ఉపయోగించండి. మీరు మరియు మీ పిల్లలు సురక్షితంగా ఉండడం కోసం అతన్ని శాంతింపజేసేందుకు మీరేం చేయగలరో అది చేయండి.
మీరు అతని నుండి తప్పించుకోక తప్పని పరిస్థితి ఉంటే, మీరు తప్పించుకునే మార్గం గురించి ఆలోచించండి. మీరు వెళ్ళడానికి అత్యంత సురక్షితమైన ప్రదేశం ఎక్కడ ఉంది? అని ఆలోచించండి.