AIDS అంటే ఏమిటి
HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) అనేది మీ కంటికి కనిపించని అతిచిన్న సూక్ష్మజీవి. దీనిని వైరస్ అని పిలుస్తారు. AIDS (అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియెన్సీ సిండ్రోమ్) అనేది ఒక వ్యక్తి HIV అనే ఎయిడ్స్ వైరస్ బారిన పడిన తర్వాత తీవ్రమయ్యే వ్యాధినే AIDSగా పిలుస్తారు.
ఎవరికైనా AIDS ఉన్నప్పుడు వారి రోగనిరోధక వ్యవస్థ అత్యంత బలహీన పడి, అది ఇకపై ఇన్ఫెక్షన్లతో పోరాడలేని పరిస్థితి వస్తుంది. దీంతో, వాళ్లు తరచుగా డయేరియా లేదా ఫ్లూ లాంటి అనేక సాధారణ అనారోగ్యాలతో బాధపడుతుంటారు. AIDS సంకేతాలనేవి ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉండవచ్చు. HIVకి గురికాని వ్యక్తులకు అత్యంత అరుదుగా మాత్రమే వచ్చే కొన్ని క్యాన్సర్లు లేదా మెదడు ఇన్ఫెక్షన్లు లాంటివి AIDS వ్యక్తులకు సులభంగా రావచ్చు.
మంచి పోషకాహారం మరియు సరైన మందులు తీసుకోవడం ద్వారా, AIDS వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లతో శరీరం మెరుగ్గా పోరాడగలుగుతుంది. తద్వారా, ఆమె లేదా అతను ఎక్కువ కాలం జీవించవచ్చు. అయితే, HIVకి ఎటువంటి నివారణ లేదు.