HIVని నేనెలా నిరోధించగలను
ఈ మార్గాల ద్వారా మీరు HIV వ్యాప్తిని నిరోధించవచ్చు:
సాధ్యమైనంతవరకు, మీతో మాత్రమే లైంగిక సంబంధం కలిగిన వ్యక్తితో మాత్రమే లైంగిక సంబంధంలో ఉండండి.
సురక్షిత లైంగిక పద్ధతులు అనుసరించండి - అంటే, వీర్యం, రక్తం మరియు యోని ద్రవాలు మీ యోని, పాయువు లేదా నోటిలోకి ప్రవేశించకుండా నిరోధించే పద్ధతులు అనుసరించండి. లైంగిక చర్యలో పాల్గొన్న ప్రతిసారి సరైన పద్ధతిలో కండోమ్ ఉపయోగించండి.
HIV పరీక్ష చేయించుకోండి మరియు STIల కోసం చికిత్స పొందండి. మీ భాగస్వాములు కూడా ఆ విధంగా చేస్తున్నారని నిర్ధారించుకోండి.
ఇతరుల కోసం ఉపయోగించిన తర్వాత, క్రిమిసంహారకం చేయని సూదులు లేదా ఇతర సాధనాలతో మీ చర్మాన్ని కోయడం లేదా కత్తిరించడం చేయకండి.
అత్యవసర పరిస్థితుల్లో తప్ప రక్తం ఎక్కించుకోకండి.
రేజర్లను ఎవరితోనూ పంచుకోకండి.
సరైన రక్షణ లేకుండా వేరొకరి రక్తం లేదా గాయం తాకకండి.