HIV ఏవిధంగా వ్యాపిస్తుంది

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

HIV ఇన్ఫెక్షన్ కలిగిన వ్యక్తుల శరీర ద్రవాల్లో-రక్తం, వీర్యం, రొమ్ము పాలు మరియు యోనిలోని ద్రవాల్లో HIV వైరస్ ఉంటుంది. ఈ ద్రవాలు మరొక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించినప్పుడు వైరస్ వ్యాపిస్తుంది.

అంటే, HIV అనేది క్రింది పద్ధతుల ద్వారా వ్యాపిస్తుంది:

  • ఈ వైరస్ ఉన్న వ్యక్తితో అసురక్షిత శృంగారంలో పాల్గొనడం. HIV వ్యాప్తికి ఇదే అత్యంత సాధారణ మార్గం.
  • అపరిశుభ్రమైన సూదులు లేదా సిరంజిలు ఉపయోగించడం అలాంటి ఏదైనా ఉపకరణం చర్మంలోకి గుచ్చుకోవడం లేదా కోయడం.
  • HIV లేదని నిర్ధారించని రక్తంతో రక్తమార్పిడి.
  • తల్లి లేదా తండ్రికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ తల్లి గర్భం ద్వారా, ఆమెకి జన్మించడం లేదా ఆ తల్లిపాలు తాగడం వల్ల.
  • ఇన్ఫెక్షన్ కలిగిన వ్యక్తి రక్తం చర్మం మీది కోతలు లేదా గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించడం.
Sources
  • Audiopedia ID: tel011003