HIV పరీక్ష ఎలా పనిచేస్తుంది

From Audiopedia
Jump to: navigation, search

HIV శరీరంలోకి ప్రవేశించినప్పుడు, ఆ వైరస్‌తో పోరాడడం కోసం శరీరం వెంటనే ప్రతిరోధకాలను తయారు చేయడం ప్రారంభిస్తుంది. ఈ ప్రతిరోధకాలు సాధారణంగా 2 నుండి 4 వారాల తర్వాత రక్తంలో కనిపిస్తాయి.

HIV పరీక్ష అనేది రక్తంలోని ఈ ప్రతిరోధకాల కోసం చూస్తుంది. ఒక వ్యక్తికి HIV సోకిందో, లేదో తెలుసుకోవడానికి HIV పరీక్ష ఒక్కటే మార్గం. ఇది ఎయిడ్స్ కోసం పరీక్ష కాదు.

శీఘ్ర HIV పరీక్ష అనేది అనేక ఆరోగ్య కేంద్రాలు మరియు ఆసుపత్రుల్లో తక్కువ ఖర్చుతో లేదా ఉచితంగా అందుబాటులో ఉంది. సాధారణంగా అదే రోజున మీరు పరీక్ష ఫలితాలు పొందవచ్చు.

HIV పరీక్షలో పాజిటివ్‌గా తేలితే, మీకు వైరస్ సోకిందని మరియు HIVకి వ్యతిరేకంగా మీ శరీరం ప్రతిరోధకాలను తయారు చేసిందని అర్థం. కాబట్టి, మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, మీరు వైరస్‌ను ఇతరులకు వ్యాప్తి చేయగలరు.

HIV పరీక్షలో నెగటివ్‌గా తేలితే, 2 విషయాలు గుర్తుంచుకోవాలి:

  • మీకు HIV సోకలేదు, లేదా
  • మీకు ఇటీవల ఇన్ఫెక్షన్ సోకినప్పటికీ, మీ శరీరంలో HIV కోసం ఇంకా తగినంత ప్రతిరోధకాలు తయారు కాలేదు.

HIV పరీక్షలో మీకు నెగటివ్ వచ్చినప్పటికీ, మీకు ఆ వ్యాధి సోకి ఉండవచ్చని మీరు భావిస్తుంటే, సుమారుగా 6 వారాల తర్వాత, మీరు మళ్లీ పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్ వచ్చినప్పుడు కూడా, కొన్నిసార్లు పరీక్షను పునరావృతం చేయాలి. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆరోగ్య కార్యకర్త మీకు సహాయపడగలరు.

గుర్తుంచుకోండి: పరీక్షలో నెగటివ్ వచ్చిందంటే, అప్పటివరకు మీకు HIV లేదని మాత్రమే అర్థం. ఆ తర్వాత కూడా, మిమ్మల్ని మీరు రక్షించుకోకపోతే, మీకు ఆ వ్యాధి సోకవచ్చు. సురక్షిత లైంగిక సంబంధాలు కలిగి ఉండండి. కండోమ్ ఉపయోగించండి.

HIV పరీక్ష ఎల్లప్పుడూ ఈవిధంగానే చేయాలి:

  • మీ అనుమతితో.
  • పరీక్షకు ముందు మరియు తరువాత కౌన్సెలింగ్ అందించాలి.
  • ఫలితం విషయంలో గోప్యత పాటించాలి. మీరు మరియు మీరు అనుమతించిన వారికి తప్ప వేరెవరికీ ఫలితాలు తెలియకూడదు.
Sources
  • Audiopedia ID: tel011008